ETV Bharat / state

సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Lok Sabha Approves Telangana Tribal University Bill : తెలంగాణలో సమక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది. కేంద్ర విశ్వవిద్యాలయాల జాబితాలో ఈ యూనివర్సిటీ పేరును చేరుస్తూ తెచ్చిన సవరణ చట్టం బిల్లుపై, లోక్​సభ మూజువాణి ఓటుతో పచ్చ జెండా ఊపింది. ఇందులో గిరిజనేతర విద్యార్థులూ చదువుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Lok Sabha Approves Tribal University Bill in Telangana

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 8, 2023, 12:10 PM IST

Lok Sabha Approves Telangana Tribal University Bill : ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రం, తెలంగాణలో ఏర్పాటు చేయతలపెట్టిన సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ బిల్లుకు (Sammakka Sarakka Tribal University Bill) గురువారం లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. కేంద్ర విశ్వవిద్యాలయాల జాబితాలో ఈ విశ్వవిద్యాలయం పేరును చేరుస్తూ కేంద్ర విద్యాశాఖ ప్రవేశపెట్టిన కేంద్రీయ విశ్వవిద్యాలయాల సవరణ చట్టం బిల్లుపై రెండు రోజుల చర్చల అనంతరం సభ మూజువాణి ఓటుతో గ్రీన్​సిగ్నల్ ఇచ్చింది.

గిరిజనుల అభ్యున్నతికి ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకుంటున్నారని లోక్​సభలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Union Education Minister Dharmendra Pradhan) పేర్కొన్నారు ఇందులో భాగంగానే సమ్మక్క సారక్క వర్సిటీ నెలకొల్పుతున్నామని చెప్పారు. సమ్మక్క సారక్క పేరిట తెలంగాణలోని మేడారంలో జరిగే అతిపెద్ద గిరిజన ఉత్సవానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందినవారే కాకుండా ఒడిశా, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల గిరిజనులు హాజరవుతుంటారని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. అందుకే ఆ ఉత్సవం జరిగే ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

Sammakka Sarakka Tribal University : HCU స్థాయిలో గిరిజన యూనివర్సిటీ.. వచ్చే ఏడాది నుంచి తరగతులు!

Lok Sabha Approves Sammakka Sarakka Tribal University Bill : ఈ యూనివర్సిటీ ఏర్పాటులో జాప్యం గురించి చాలా మంది సభ్యులు ప్రశ్నించారని.. అయితే తెలంగాణ సర్కార్ స్థలం కేటాయించడంలో జాప్యం చేయడం వల్లే ఇది ఆలస్యమైందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటపడటంతో తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు స్థలం కేటాయించిందని చెప్పారు. దాదాపు రూ.900 కోట్లతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

గిరిజనేతర విద్యార్థులూ చదువుకోవచ్చు : గతంలో మధ్యప్రదేశ్‌లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటైందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కోటి చొప్పున ఏర్పాటుచేసే అవకాశం లభించిందని చెప్పారు. గిరిజన విశ్వవిద్యాలయాలు కేవలం ఆ వర్గం విద్యార్థులకే పరిమితం కాదని, అందులో ఇతర విద్యార్థులూ చదువుకోవచ్చని అన్నారు. రాజ్యాంగపరంగా గిరిజన విద్యార్థులకు ఇక్కడ రిజర్వేషన్లు అమలవుతాయని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉండే ఈ వర్సిటీలు ఆ వర్గం అంశాలపై చర్చించి, పరిశోధనలు నిర్వహిస్తాయని అని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.

Sammakka Sarakka Tribal University Bill : తెలంగాణ ప్రజలు 9 ఏళ్లగా ఎదురుచూస్తున్న సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణానికి కేంద్ర మంత్రి మండలి ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దేశంలోనే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాల్లో(Central Tribal University) ఇది మూడోవది కానుంది. వచ్చే సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని రాష్ట్ర గిరిజన సంక్షేమ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. తాత్కాలిక క్యాంపస్‌ కోసం ములుగు జిల్లా జకారంలోని యువజన శిక్షణ కేంద్రంలో అవసరమైన మౌలిక సదుపాయాలు నాలుగేళ్ల క్రితమే సిద్ధం చేసినట్లు తెలిపాయి.

'రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు' ప్రకటించిన ప్రధాని

Central Tribal University in Telangana 2023 : 9 ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ.. వనదేవతల చెంత విద్యాకేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.