తెలంగాణలో లాక్డౌన్ సమయంలో వాయిదా పడ్డ ఇంటర్ పరీక్ష ఇవాళ జరగనుంది. ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడం వల్ల మార్చి 23న జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. బుధవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం జాగ్రఫీ, మోడరన్ లాంగ్వేజేస్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 860 మంది విద్యార్థులు మాత్రమే హాజరు కావాల్సి ఉంది.
పరీక్ష కేంద్రం వద్ద శానిటైజేషన్, భౌతిక దూరం, విద్యార్థుల శరీర ఉష్ణోగ్రత పరిశీలన వంటి కోవిడ్ నివారణ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. కరోనా పరిస్థితులు, రవాణా సదుపాయం లేకపోవడం వంటి ఏదైనా కారణాలతో నేటి పరీక్షకు హాజరు కాలేక పోతే.. జులై రెండో వారంలో జరగనున్న అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షకు హాజరు కావచ్చునని జలీల్ పేర్కొన్నారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ లో ఉత్తీర్ణులైన వారిని కూడా.. రెగ్యులర్ విద్యార్థులుగానే గుర్తిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు
ఇదీ చూడండి : చిన్నపిల్లల పట్ల అసభ్య ప్రవర్తన