ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసులు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. రెడ్జోన్లలో నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఆచంట మండలం రెడ్‌జోన్ అయినప్పటికీ... పలువురు వాహనదారులు అనవసరంగా రోడ్లపైకి వచ్చారు. అలాంటివారికి గుంజీళ్లు తీయించి ఎస్ఐ సీహెచ్.రాజశేఖర్ వినూత్న రీతిలో గుణపాఠం చెప్పారు. అనంతరం వారందరికీ కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు. మరోసారి ఇలా రోడ్లపైకి వస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.
ఇదీ చూడండి: 'నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలే'