ETV Bharat / state

ఇంకెంత కాలం ఇంట్లో ఉండాలని పేచీ పెడుతున్నాడు? - children problems

మా బాబు వయసు ఏడేళ్లు. ఈ మధ్య వాడిలో చాలా మార్పు కనిపిస్తోంది.. ఇంకెన్నాళ్లు ఇంట్లో ఉండాలి. బయటకు వెళ్దాం అంటూ మారాం చేస్తున్నాడు. డిజిటల్‌ క్లాసులకు హాజరవుతున్నా...ఏకాగ్రత ఉండదు. మధ్యలో దాన్ని ఆఫ్‌ చేస్తాడు... ఓ పద్దతి లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ఇదేమైనా సమస్యా? వాడిలో మార్పు తెచ్చేదెలా? - ఓ సోదరి

lock down effect on children
ఇంకెంత కాలం ఇంట్లో ఉండాలని పేచీ పెడుతున్నాడు?
author img

By

Published : Jul 22, 2020, 9:43 AM IST

మీ బాబులో వచ్చిన ప్రవర్తనే ఇప్పుడు చాలామంది చిన్నారుల్లో కనిపిస్తోంది. కరోనా వల్ల స్కూళ్లకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే ఆరునెలలు గడిచిపోయాయి. ఈ పరిస్థితి ఇంకెంత కాలం కొనసాగుతుందో తెలియదు.

దాంతో పిల్లల్లో క్రమశిక్షణ లోపిస్తోంది. పైగా వారు ఆటలు, స్నేహితులు, విహారం ఇలా అన్నింటికీ దూరంగా ఉన్నారు. దాంతో ఏదో కోల్పోయామన్న భావనలోకి వెళ్తున్నారు. అందుకే ఇప్పుడు అమ్మఒడే బడిగా మారాలి.

ఇంట్లోనే ఓ గదినో, హాలునో చిన్నారి స్టడీ ప్లేస్‌గా మార్చేయండి. కార్పొరేట్‌ భాషలో.. వర్క్‌స్టేషన్‌గా తీర్చిదిద్దండి. అక్కడ ఓ టేబుల్‌, కుర్చీ, బ్లాక్‌ బోర్డ్‌, పుస్తకాలు, డిజిటల్‌ తెర వంటివన్నీ ఏర్పాటు చేయండి.

దాంతో తరగతి జరిగే సమయంలో పడుకోవడం, పరుగులెత్తడం వంటివన్నీ అదుపులోకి వస్తాయి. వారికి ఏకాగ్రత వస్తుంది. అలానే పాఠశాలకు వెళ్లేప్పుడు ఎలాంటి ప్రణాళికను అమలు చేశారో...ఇంట్లో ఉన్నా చిన్నారి దాన్ని సమయానికి పూర్తిచేసేలా చేయండి.

అంటే నచ్చినప్పుడు స్నానం చేయడం, తినడం, చదువుకోవడం వంటివి అసలు చేయొద్ధు అలాకాకుండా వారి షెడ్యూల్‌ దెబ్బతింటే భవిష్యత్తులో తల్లీపిల్లలిద్దరికీ ఇబ్బందే. అన్నట్టు స్టడీ అవర్స్‌లో స్కూలు డ్రెస్‌ కూడా వేయండి.

తల్లులు తమ పనులను త్వరగా పూర్తిచేసుకుని వారితో కలిసి స్టడీ అవర్స్‌లో జాయింట్‌ యాక్టివిటీస్‌ చేయడం వల్ల వారు మరింత సులువుగా అర్థం చేసుకోగలుగుతారు.

చిన్నారులు చదువుకున్న పాఠాలను ప్రయోగాత్మకంగా వివరించొచ్ఛు అయ్యో మాకు ఏమీ తెలియదే అని అనుకోనక్కర్లేదు. మీ వంటిల్లే ఓ కెమిస్ట్రీ ల్యాబ్‌. ఉదాహరణకు ఘన, ద్రవ, వాయు రూపాలు గురించి చెబుతున్నప్పుడు ఓ ఐస్‌ ముక్కని వేడి చేసి ఆవిరి వచ్చేవరకూ ఎదురైన పరిణామాల్ని వివరించండి.

ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నిజానికి తల్లిదండ్రులకు పిల్లలతో గడిపేందుకు తగినంత నాణ్యమైన సమయం ఇప్పుడు దొరుకుతుంది.

ఇదీ చూడండి: ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై సీఎం కేసీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.