ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని శ్రీకాళహస్తి-పాపానాయుడుపేట ప్రధాన రహాదారిపై వరద ప్రవహిస్తోంది. భారీ వర్షాల (Heavy Rains in AP) కారణంగా రహదారి సరిగా కనిపించట్లేదు. ఇదే సమయంలో కొందరు కాజ్‌వే దాటేందుకు యత్నించారు. వీరిలో ముగ్గురు వరద నీటిలో చిక్కుకుపోగా.. స్థానికులు కాపాడారు.
గోవిందవరం సమీపంలో స్వర్ణముఖి నది కాజ్‌వేపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ సమయంలో చెల్లూరు గ్రామానికి చెందిన శంకరయ్య, అతని భార్య కోటేశ్వరమ్మ, కుమారుడు కాజ్ దాటుతుండగా.. వరద నీటిలో చిక్కుకున్నారు. స్థానికులు గుర్తించి వారిని రక్షించి గట్టుకు తీసుకువస్తుండగా.. మరోసారి అదుపుతప్పి కొద్ది దూరం కొట్టుకుపోయారు. దీంతో మరింత అప్రమత్తమై.. ముగ్గురిని సురక్షితంగా కాపాడి బయటకు తీసుకువచ్చారు.
పొంగుతున్న వాగులు వంకలు..
ప్రస్తుతం ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ వర్షాలు (Heavy Rains in AP) నమోదు అవుతున్నాయి. ప్రత్యేకించి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల (Heavy Rains in AP) కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలో అత్యధికంగా 19.5 సెంటిమీటర్ల వర్షపాతం (Heavy Rains in AP) నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళికా విభాగం వెల్లడించింది.
నెల్లూరు జిల్లా ముత్తుకూరు లో 19 సెంటిమీటర్ల వర్షపాతం (Heavy Rains in AP) నమోదైంది. నెల్లూరు జిల్లా తడలో 18.9 సెంటిమీటర్ల వర్షపాతం (Heavy Rains in AP) నమోదు అయినట్టు పేర్కొంది. వాకాడులో 18.2, నాయుడు పేటలో 15 సెంటిమీటర్లు నమోదైంది. సత్యవేడులో 15.5 సెంటిమీటర్లు, వడమాలపేటలో 15.1 సెంటిమీటర్ల వర్షపాతం (Heavy Rains in AP) కురిసినట్టు తెలిపింది. పుత్తూరులో 10 సెంటిమీటర్లు, తూర్పుగోదావరి జిల్లా అల్లవరంలో 6.1 సెంటిమీటర్ల వర్షపాతం (Heavy Rains in AP) రికార్డు అయ్యింది. కడప జిల్లా చిట్వేలులో 4.8 సెంటిమీటర్ల వర్షపాతం (Heavy Rains in AP), రాయచోటిలో 2.2 సెంటిమీటర్ల వర్షపాతం, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో 2.1 సెంటిమీటర్ల వర్షపాతం కురిసింది. ఒంగోలు, ఉలవపాడులలో 1.5 సెంటిమీటర్ల వర్షపాతం (Heavy Rains in AP), మచిలీపట్నంలో 1.3 సెంటిమీటర్ల వర్షపాతం (Heavy Rains in AP) నమోదైనట్టు ఏపీ ప్రణాళికా విభాగం తెలిపింది.
ఇదీ చూడండి: RAIN ALERT: ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో వర్షాలు