ఆంధ్రప్రదేశ్లో వివిధ కారణాలతో ఎన్నికలు జరగని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు ఇవాళ ఎన్నికలు (AP Local Body Elections 2021 ) జరగుతున్నాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పోలింగ్ (AP Local Body Elections 2021 ) ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని డివిజన్లలో ఎన్నికలు (AP Local Body Elections 2021 ) జరగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు, కృష్ణా జిల్లాలో జగ్గయ్య పేట, కొండపల్లి , గుంటూరు జిల్లాలో దాచేపల్లి, గురజాల, ప్రకాశం జిల్లాలో దర్శి, నెల్లూరు జిల్లాలో బుచ్చి రెడ్డి పాలెంలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న చిత్తూరు జిల్లా లో కుప్పం మున్సిపాల్టీలో ఎన్నికలను (AP Local Body Elections 2021 ) అధికార ప్రతిపక్ష పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. కర్నూలు జిల్లాలో బేతం చర్ల , కడప జిల్లాలో కమలాపురం, కడప జిల్లా రాజంపేట, అనంతపురం జిల్లాలో పెనుకొండ మున్సిపాల్టీలకు ఎన్నికలు (AP Local Body Elections 2021 ) జరుగుతున్నాయి.
వివిధ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు (AP Local Body Elections 2021 ) జరగని వార్డుల్లోనూ ఎన్నికల కమిషన్ పోలింగ్ నిర్వహిస్తోంది. గ్రేటర్ విశాఖలో రెండు డివిజన్ స్థానాలకు, విజయనగరం, కాకినాడ, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌ల పరిధిలోని 10 డివిజన్‌ల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ విశాఖలో 31, 61 వార్డుల్లో ఎన్నికలు (AP Local Body Elections 2021 ) జరుగుతున్నాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, కృష్ణా జల్లా నూజివీడు , గుంటూరు జిల్లా రేపల్లి, మాచర్ల, ప్రకాశం జిల్లా అద్దంకి, కడప జిల్లాలో బద్వేలు, చిత్తూరు జిల్లా నగరి, కర్నూలు జిల్లా నందికొట్కూరు, ఎమ్మిగనూరు, అనంతపురం జిల్లా రాయదుర్గంలో పలు వార్డులకు ఎన్నిక (AP Local Body Elections 2021 ) నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: 'కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటాం'