ETV Bharat / state

చనిపోయినోళ్ల పేరు మీద బ్యాంకు రుణాలు! - HYDERABAD CP SAJJANAR PRESS MEET

వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన సాఫ్ట్‌వేర్‌ సిబ్బందే వారి లక్ష్యం... కాసుల కోసం కక్కుర్తి పడి మృతి చెందిన వారు బతికే ఉన్నట్టు బ్యాంకులను నమ్మిస్తారు. వారి పేరు మీద అనేక బ్యాంకుల్లో రుణాలు తీసుకొని 50 లక్షలకు పైగా మోసం చేసిన ముఠా... సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతోంది.

loan cheaters
చనిపోయినోళ్ల పేరు మీద బ్యాంకు రుణాలు!
author img

By

Published : Feb 9, 2020, 3:16 PM IST

చనిపోయిచనిపోయినోళ్ల పేరు మీద బ్యాంకు రుణాలు!నోళ్ల పేరు మీద బ్యాంకు రుణాలు!

రకరకాల మార్గాల ద్వారా మృతి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల వివరాలు తెలసుకుని... వారి పేరు మీద నకిలీ గుర్తింపు కార్డులు సృష్టిస్తారు. మృతులు గతంలో వాడిన చరవాణుల నంబర్లు తిరిగి కావాలంటూ ఆయా సెల్‌ సంస్థలకు దరఖాస్తు చేసుకొని తిరిగి అవే నంబర్లు పొంది... వారికి బంధించిన ఇతర వివరాలు తెలుసుకొని పక్కాగా బ్యాంకులను నమ్మిస్తారు. బ్యాంకు సిబ్బంది పూర్తిగా నమ్మిన తరువాత... రుణాల తీసుకుంటారు.

చనిపోయాక రుణమెలా?

పాలపర్తి రఘురాం మృతిచెందాడు. కానీ అతని పేరిట హెడీఎఫ్‌సీ బ్యాంకులో రెండు లక్షల డెబ్భై వేల రూపాయల రుణం పొందారు. ఎంతకీ రుణం చెల్లించకపోయే సరికి బ్యాంకు సిబ్బంది రఘురాం ఇంటికి వెళ్లగా... రుణం తీసుకునే కంటే ముందే రఘురాం మృతి చెందినట్టు ఆయన భార్య తెలిపారు. అనుమానం వచ్చిన బ్యాంకు మేనేజరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల రంగప్రవేశంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది.

ఒక్కో వ్యక్తి పేరిట నాలుగైదు బ్యాంకుల్లో రుణాలు

గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన నిమ్మగడ్డ ఫణి కూకట్‌పల్లి ప్రగతినగర్‌లో నివసిస్తున్నాడు. అతనితోపాటు స్నేహితులు స్వరూపనాథ్‌, శ్రీనివాసరావు, హరీష్‌, వేణుగోపాల్‌, షేకర్‌రావు కలిసి ముఠాగా ఏర్పడి మోసాలకు తెరలేపారు. విష్ణు కుమార్‌, అవకాష్‌ మహంత, అభిషేక్‌ ఆనంద్‌ అనే మృతి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల పేరిట ఐసీఐసీఐ, ఎస్బీఐ, ఆర్బీఎల్‌, కొటాక్‌ మహీంద్ర బ్యాంకులను మోసం చేసినట్టు వెల్లడైంది. ఇలా చాలా బ్యాంకుల్లో రుణాలు తీసుకొని దాదాపు 53 లక్షల రూపాయలు స్వాహా చేసినట్లు పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు.

ఎలాంటి విచారణలేకుండానే రుణాలు

బ్యాంకు సిబ్బంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి గురించి ఏం తెలుసుకోకుండానే డబ్బులు మంజూరు చేస్తున్నట్టు సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిపై పూర్తిస్థాయి విచారణ జరిపిన తర్వాతే డబ్బులు మంజూరు చేయాలని అధికారులు చెబుతున్నారు. నిందితులపై పీడీ చట్టం నమోదు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి: అత్యాచార ఉచ్చుల్లో అకృత్యాలెన్నెన్నో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.