హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో ప్రచారం నిర్వహించేందుకు పది మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథికి భాజపా అందజేసింది.
కేంద్ర మంత్రి సహా ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలకు ఈ జాబితాలో ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్, జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఎం.రఘునందన్‌రావు భాజపా స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించనున్నట్లు భాజపా పార్టీ వర్గాలు వెల్లడించాయి.
- ఇదీ చూడండి: 120 కిలోల గంజాయి పట్టివేత.. ఓ వ్యక్తి అరెస్ట్