Liquor Seized: ఏపీలో కర్ణాటక నుంచి రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న భారీ మద్యాన్ని చిత్తూరు జిల్లాలో గంగవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి కొరియర్ వాహనం ద్వారా తరలిస్తున్న పది వేల టెట్రా ప్యాకెట్లు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా మూడు వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు.
ఏడుగురిని అరెస్టు చేసినట్లు వివరించారు. పట్టుబడ్డ మద్యం విలువ సుమారు 10 లక్షల రూపాయలు, వాహనాల విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. అయితే అరెస్టైన వారిలో చిత్తూరు 38వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ మిట్టూరు ఉన్ని కుమార్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: