Liquor Sales Telangana 2023 : రాష్ట్రంలో ఏడాదికేడాది మద్యం అమ్మకాలు జోరందుకుంటున్నాయి. రికార్డు స్థాయిలో అమ్ముడు పోతున్నాయి. వాణిజ్య పన్నుల శాఖ తర్వాత అత్యధికంగా ఆదాయాన్నితెచ్చిపెట్టే అబ్కారీ శాఖ 2023లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో రాబడి తెచ్చి పెడుతోంది. గత ఏడాది 35వేల కోట్లకుపైగా ఆదాయాన్ని తెచ్చిపెట్టిన ఎక్సైజ్ శాఖ ఈ ఆర్థిక ఏడాది అంతకంటే ఎక్కువ రాబడి ద్వారా వస్తుందని అంచనా వేస్తోంది.
Record Level Liquor Sales in Telangana 2023 : 2023లో రూ.36,151 కోట్లకుపైగా విలువైన 3.58కోట్ల కేసులకు పైగా లిక్కర్ 5.34 కోట్ల కేసులకు పైగా బీర్‌ను మందుబాబులు తాగేశారు. 2022లో కంటే దాదాపు రెండు వేల కోట్లు విలువైన మద్యాన్నిఅధికంగా మద్యం ప్రియులు తాగారు. అత్యధికంగా మద్యాన్ని తాగిన ఉమ్మడి జిల్లాల్లో రంగారెడ్డిలో రూ. 8,899.44 కోట్లు, హైదరాబాద్‌లో రూ.3758.46 కోట్లు, వరంగల్‌లో రూ.3,549.41 కోట్లు విలువైన మద్యాన్ని తాగినట్లు ఆబ్కారీ శాఖ అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Liquor Sales in Telangana State : మందుబాబులా మజాకా.. వేసవిలో బీర్లు కుమ్మేశారుగా
Liquor Sales Increasing In Telangana : రాష్ట్రంలో 2022లో భారీ మొత్తంలో రూ.34,353 కోట్ల విలువైన 3.58 కోట్ల కేసులు లిక్కర్, 4.60 కోట్ల కేసులు బీరు మద్యం ప్రియులు పీల్చేశారు. 2022తో పోలిస్తే 2023లో దాదాపు రెండు వేల కోట్ల విలువైన మద్యం అమ్మకాలు అధికంగా జరగ్గా లిక్కర్ కేసుల సంఖ్య 22,731 లిక్కర్ కేసులు 2023 కంటే తగ్గగా బీరు విక్రయాలు మాత్రం 75.48లక్షల కేసుల అమ్మకాలు అధికంగా జరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
2023లో జనవరి నుంచి డిసెంబరు వరకు జరిగిన మద్యం విక్రయాలు జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో మాత్రం మూడు వేల కోట్ల కంటే తక్కువ విలువ చేసే మద్యం అమ్ముడు పోగా మిగిలిన అయిదు నెలల్లో మూడువేల కోట్ల కంటే ఎక్కువ అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆర్థిక ఏడాదిలో మద్యం ద్వారా భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
న్యూ ఇయర్ కిక్కు - 4 రోజుల్లో రూ.770 కోట్ల మద్యం అమ్మకాలు
Huge Quantity Liquor Sales : ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం రూ.36వేల కోట్లకుపైగా ఆదాయం వచ్చేందుకు అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. నవంబరు నెల చివరి వరకు గత లైసెన్స్ కాలం తీరుతుండడంతో ఆ నెలలో భారీగా అమ్మకాలు పడిపోయాయి. సింహ భాగం తక్కువ విలువైన మద్యం అమ్ముడు పోగా డిసెంబర్ నెలలో అత్యధికంగా రూ.4,297 కోట్లు విలువైన మద్యం అమ్ముడు పోయి రికార్డును నెలకొల్పినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎన్నికల వేళ ఎక్సైజ్‌శాఖ అలర్ట్ - వాటి సరఫరాపై ప్రత్యేక నిఘా
రాష్ట్రంలో ఎన్నికల వేళ తగ్గిన మద్యం అమ్మకాలు - అక్రమ లిక్కర్‌పై ఎక్సైజ్ శాఖ ఫోకస్