ETV Bharat / state

చలి పెడుతోందని ఎక్కువగా తాగేస్తున్నారు...! - HEAVY FLOW OF LIQUOR IN WINTER

నూతన మద్యం విధానానికి చలి కూడా తోడు కావటం వల్ల మందుబాబులు మద్యాన్ని మంచినీళ్లలా తాగేస్తున్నారు. మద్యం విక్రయాలు మునుపటికంటే జోరుగా సాగుతున్నాయి. 14 నుంచి 16 వందల కోట్ల మేర జరిగే అమ్మకాలు.. నవంబరులో ఇప్పటికే రూ.రెండు వేల కోట్లకు పైగా విలువైన మద్యాన్ని మందుబాబులు తాగేశారు.

LIQUOR SALES INCREASED IN TELANGANA STATE IN WINTER SEASON
LIQUOR SALES INCREASED IN TELANGANA STATE IN WINTER SEASON
author img

By

Published : Nov 28, 2019, 5:31 AM IST

Updated : Nov 28, 2019, 7:34 AM IST

చలి పెడుతోందని ఎక్కువగా తాగేస్తున్నారు...!

రాష్ట్రంలో మద్యం విధానాన్ని సరళతరం చేయటం వల్ల అమ్మకాలు వేగం పుంజుకున్నాయి. గత నెల నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమలులోకి రాగా... నిన్నటి వరకు రూ.3 వేల 735 కోట్లు విలువైన మద్యాన్ని మందుబాబులు తాగేశారు. ఈ ఏడాది సెప్టెంబరు నెలలో రూ.ఒక వేయి 481 కోట్ల విలువైన 25.40 లక్షల కేసుల లిక్కరు, 31.11 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. కొత్త మద్యం విధానం అమలులోకి వచ్చిన అక్టోబరు నెలలో రూ.1,663 కోట్ల విలువైన 27.02 లక్షలు కేసులు లిక్కరు, 38.66 లక్షల కేసుల బీరు విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి.

ఈ నెల ఇప్పటికే రూ. 2 వేల కోట్లు...

ఇక ఈ నెల 27వ తేదీ సాయంత్రం వరకు రూ.2,072 కోట్లు విలువైన 34.05 లక్షల కేసుల లిక్కరు, 39.73 లక్షల కేసుల బీరు అమ్మకాలు జరిగాయి. ఈ నెల ముగిసేసరికి అమ్మకాలు రూ. 2500 కోట్లకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబరు, జనవరి నెలల్లో విక్రయాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. చలి తీవ్రత పెరగటం వల్ల... మద్యం అమ్మకాలు ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు.

చలి తగ్గేదాకా ఇదే జోరు...

కొత్త విధానం అమలులోకి వచ్చిన అక్టోబరు నెలలో దుకాణాల ఏర్పాటు, పర్మిట్‌ గదుల ఏర్పాటులో కొంత జాప్యం జరగటం వల్ల అమ్మకాలు ఆశించిన మేరకు జరగలేదని అధికారులు తెలిపారు. నవంబరు నెలలో... అమ్మకాలు ఊపందుకున్నాయని వివరించారు. ఇదే ఒరవడి కొనసాగితే... చలి తీవ్రత తగ్గే వరకు అమ్మకాలు జోరుమీదుంటాయని అధికారులు అంచనాలు వేస్తున్నారు. నెలకు మూడు వేల కోట్లకు చేరుకోవచ్చనే అశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇది చదవండి: బాంబు పేలి టాలీవుడ్ హీరో సందీప్​ కిషన్​కు గాయాలు

TG_Hyd_06_28_LIQUOR_SALES_INCREASE_PKG_3038066 Reporter: M.Tirupal Reddy ()చలి పెరగడంతో తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. నూతన మద్యం విధానంలో అమ్మకాలు అనూహ్యంగా పెరుగుతన్నాయి. ప్రతి నెల 14 నుంచి 16వందల కోట్లు మేర జరిగే అమ్మకాలు నవబంరులో ఇప్పటికే రెండు వేల కోట్లకుపైగా విలువైన మద్యాన్ని మందుబాబులు తాగేశారు. డిసెంబరు, జనవరి నెలల్లో మద్యం అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని అబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. LOOK వాయిస్ఓవర్‌1: తెలంగాణా రాష్ట్రంలో మద్యం విధానాన్ని సరళతరం చేయడంతో మద్యం అమ్మకాలు వేగం పుంజుకున్నాయి. గత నెల నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమలులోకి రాగా నిన్నటి వరకు రూ.3,735 కోట్లు విలువైన మద్యాన్ని మందుబాబులు మంచి నీళ్లలా తాగేశారు. ఈ ఏడాది సప్టెంబరు నెలలో రూ.1481 కోట్లు విలువైన 25.40లక్షల కేసులు లిక్కరు, 31.11లక్షల కేసులు బీరు అమ్ముడు పోయింది. కొత్త మద్యం విధానం అమలులోకి వచ్చిన అక్టోబరు నెలలో రూ.1,663 కోట్లు విలువైన 27.02 లక్షలు కేసులు లిక్కరు, 38.66లక్షల కేసులు బీరు విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇక ఈ నెల 27వ తేదీ సాయంత్రం వరకు రూ.2,072 కోట్లు విలువైన 34.05లక్షల కేసులు లిక్కరు, 39.73 లక్షల కేసులు బీరు అమ్మకాలు జరిగాయి. ఈ లెక్కన తీసుకుంటే ఈ నెలలో మరో మూడు రోజులు ఉండడంతో అమ్మకాలు రూ. 2500 కోట్లుకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్న అధికారులు డిసెంబరు, జనవరి నెలల్లో విక్రయాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. చలి తీవ్రత పెరగడంతో...అటు లిక్కర్‌తోపాటు ఇటు బీరు కూడా మద్యం ప్రియులు అధికంగా తాగుతున్నారు. కొత్త విధానం అమలులోకి వచ్చిన అక్టోబరు నెలలో దుకాణాలు ఏర్పాటు, పర్మిట్‌ గదులు ఏర్పాటులో కొంత జాప్యం జరగడంతో అమ్మకాలు ఆశించిన మేరకు జరగలేదని తెలిపారు. నవంబరు నెలలో...పూర్తి స్థాయిలో దుకాణాలు ఏర్పాటు, పర్మిట్‌ గదులు ఏర్పాటుతో...అమ్మకాలు ఊపందుకున్నాయని వివరించారు. ఇదే ఉరువడి కొనసాగితే...చలి తీవ్రత తగ్గే వరకు అమ్మకాలు అనూహ్యం పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్న అధికారులు నెలకు మూడు వేల కోట్లుకు కూడా పెరుగుతాయని తెలిపారు. END
Last Updated : Nov 28, 2019, 7:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.