ప్రభుత్వంతో చర్చించి దుకాణదారులకు నష్టం రాకుండా చూస్తానని వైన్ అసోసియేషన్ సభ్యులకు అధికారులు భరోసా ఇచ్చారు. అయినప్పటికీ అనుమతులు పొడిగించుకోక పోవటం వల్ల.... ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యాన్ని విక్రయించుకోవచ్చని అబ్కారీ అధికారులు తెలిపారు. తద్వారా లైసెన్సు పొడగించుకునేందుకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.
రంగలో దిగిన ఎక్సైజ్ అధికారులు....
ఇదే అవకాశంగా భావిస్తున్న కొందరు దుకాణదారులు అధిక ధరలకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. చాలా ప్రాంతాల నుంచి మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు మందుబాబుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు... అధిక ధరలకు విక్రయాలు చేస్తున్న దుకాణాలపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. రెండున్నర లక్షల అపరాధ రుసుం విధిస్తున్నారు.
గడువు ముగియటం వల్లే ఉల్లంఘనలు...
నెలాఖరుతో గడువు ముగుస్తుండటం వల్ల తమ మాటలను దుకాణదారులు పట్టించుకోవడం లేదని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. నూతన మద్యం విధానంలో తిరిగి తమకు దుకాణాలు దక్కుతాయో... లేదో అనే కారణంతో అధికారులను పట్టించుకోవట్లేదని చెబుతున్నారు. లైసెన్స్‌ల కాలపరిమితి ఉండి దుకాణాలు నడిపే పరిస్థితి ఉంటే.... ఉల్లంఘనలు జరగకుండా జాగ్రత్తపడేవారని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చూడండి: 'ఆర్టీసీ సమ్మెపై పంతాలకు పోకుండా నిర్ణయం తీసుకోండి'