సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న నలుగురు యువకులు గంజాయి ద్రావణాన్ని తయారుచేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు అపార్ట్మెంట్లో సోదాలు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి 8 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయి ద్రావణం, కారు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
వైజాగ్ గాంజా... హైదరాబాద్‌లో దందా
వైజాగ్ నుంచి గంజాయి ద్రావణాన్ని తీసుకొచ్చి చిన్న సీసాల్లో నింపి బెంగళూర్‌తో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ దందా ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారనే దానిపై స్థానిక పోలీసులతో కలిసి దర్యాప్తు చేస్తున్నామని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ అన్నపూర్ణ తెలిపారు.
ఇదీ చూడండి : బెంగళూరు, ఫ్రెంచ్ ఫ్రై... ఐపీఎల్లో టాప్ ఇవే