వైద్యం కోసం వచ్చిన 22సంవత్సరాల వివాహిత పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన 65సంవత్సరాల వృద్ధ వైద్యుడిని అరెస్టు చేశారు గోపాలపురం పోలీసులు. సికింద్రాబాద్ మైలర్గడ్డలో గత 30సంవత్సరాల నుండి డా.చంద్రమోహన్ హోమియోపతి క్లినిక్ నడుపుతున్నాడు. వైద్యం కోసం గత కొంతకాలంగా ఓ దంపతులు ఆసుపత్రికి వస్తున్నారు. నిన్న భర్త వేరే పని మీద బయటకు వెళ్లడం వల్ల ఒంటరిగా మహిళ వైద్యం కోసం వచ్చింది. ఇదే అదునుగా భావించిన వైద్యుడు సాధారణ పరీక్షల నిమిత్తం లోపలి గదికి తీసుకువెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిని పసి గట్టిన ఆమె వెంటనే వైద్యున్ని తోసేసి ఇంటికి వెళ్లి భర్తకు తెలియజేశారు. బాధితులు వెంటనే చిలుకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన ఖాకీలు నిందితున్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు.
'లైంగిక వేధింపులకు పాల్పడిన వృద్ధ వైద్యుడి అరెస్ట్' - undefined
వైద్యం కోసం వచ్చిన మహిళ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన హోమియోపతి వృద్ధ వైద్యుడిని బాధిత మహిళ ఫిర్యాదుతో సికింద్రాబాద్ చిలుకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు.
వైద్యం కోసం వచ్చిన 22సంవత్సరాల వివాహిత పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన 65సంవత్సరాల వృద్ధ వైద్యుడిని అరెస్టు చేశారు గోపాలపురం పోలీసులు. సికింద్రాబాద్ మైలర్గడ్డలో గత 30సంవత్సరాల నుండి డా.చంద్రమోహన్ హోమియోపతి క్లినిక్ నడుపుతున్నాడు. వైద్యం కోసం గత కొంతకాలంగా ఓ దంపతులు ఆసుపత్రికి వస్తున్నారు. నిన్న భర్త వేరే పని మీద బయటకు వెళ్లడం వల్ల ఒంటరిగా మహిళ వైద్యం కోసం వచ్చింది. ఇదే అదునుగా భావించిన వైద్యుడు సాధారణ పరీక్షల నిమిత్తం లోపలి గదికి తీసుకువెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిని పసి గట్టిన ఆమె వెంటనే వైద్యున్ని తోసేసి ఇంటికి వెళ్లి భర్తకు తెలియజేశారు. బాధితులు వెంటనే చిలుకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన ఖాకీలు నిందితున్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు.
TAGGED:
doctor arrest