ETV Bharat / state

Rains in Telangana: అల్పపీడనం ఎఫెక్ట్​.. రానున్న 3 రోజులు మోస్తరు వర్షాలు

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains in Telangana) కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పుదుచ్చేరి- చెన్నై మధ్యలో తీరాన్ని దాటిందని.. క్రమంగా అది బలహీనపడనుందని పేర్కొంది. మరో 6గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది.

Rains in Telangana
తెలంగాణ వర్షాలు
author img

By

Published : Nov 19, 2021, 4:03 PM IST

రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains in Telangana) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం.. ఆగ్నేయ బంగాళాఖాతంలోని ఉత్తర తమిళనాడు తీరంలో ఉన్న వాయుగుండం.. పశ్చిమ వాయువ్య దిశగా కదిలిందని పేర్కొంది.

మరో 6గంటల్లో

తెల్లవారుజామున 3గంటల నుంచి 4గంటల మధ్యలో పుదుచ్చేరి, చెన్నై మధ్యలో వాయుగుండం తీరాన్ని దాటినట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్న తెలిపారు. ఈ రోజు ఉదయం 08:30 గంటలకు ఈ వాయుగుండం వేలూరు తూర్పు ఆగ్నేయ దిశగా 60కిమీ దూరంలో కేంద్రీకృతమై(Rains in Telangana) ఉందని పేర్కొన్నారు. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి, క్రమంగా బలహీనపడనున్నట్లు వివరించారు. రాగల 6 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

కింది స్థాయి గాలులు

ఈ వాయుగుండం నుంచి ఉపరితల ద్రోణి.. కోస్తా ఆంధ్రా తీరం మీదుగా ఇంటీరియర్ ఒడిశా వరకు.. సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. వాయుగుండం.. రాష్ట్రానికి దూరంగా వెళ్లిపోవడంతో.. తూర్పు దిశగా తెలంగాణలోకి కింది స్థాయి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains in Telangana) కురుస్తాయని వివరించింది.

ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains In AP) కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లా పెదమాండ్యంలో అత్యధికంగా 19.9 సెంటిమీటర్లు నమోదు కాగా... కడప జిల్లా పులివెందులలో 16.9, అనంతపురం జిల్లా నల్లచెరువులో 17.1 సెంటిమీటర్ల వర్షం కురిసింది. కడప జిల్లా సింహాద్రిపురంలో 17 సెంటిమీటర్లు, చిత్తూరు జిల్లా కలకాడలో 16.8 సెంటిమీటర్లు, వడమాలపేటలో 16.5 సెంటిమీటర్లు వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లా గాజులవారీ పల్లెలో 14.8, కడప జిల్లా లింగాలలో 14.8, బుక్కరాయసముద్రంలో 14.5 సెంటిమీటర్ల వాన పడింది. ధర్మవరంలో 13.5 సెంటిమీటర్లు, తంబళ్లపల్లెలో 13.8 సెంటిమీటర్లు, పత్తికొండ 13.7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది.

అలాగే రామచంద్రాపురంలో 13 సెంటీ మీటర్లు, పలమనేరు 13 సెంటిమీటర్లు, శ్రీకాళహస్తిలో 12.7 సెంటిమీటర్లు, ప్రకాశం జిల్లా ఉలవపాడులో 12 .5 సెంటిమీటర్లు. కడప జిల్లాలో 11 సెంటిమీటర్లు, చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. తమిళనాడులో ఎడతెరిపిలేని వర్షాలకు పెరనంపట్టులో ఇల్లు కూలింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి చెందారు. శిథిలాల కింద మరో 8 మంది చిక్కుకోగా.. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: Paddy Procurement in Telangana: కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నాం.. కొనేదెప్పుడు?

Paddy Procurements Delay : నత్తనడకన ధాన్యం కొనుగోలు.. ఆందోళనలో అన్నదాతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.