ETV Bharat / state

Weather Report: రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు - moderate rains for three days

రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center) ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయని పేర్కొంది.

Weather
మోస్తారు వర్షాలు
author img

By

Published : Oct 6, 2021, 3:54 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రదేశాల్లో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center) వెల్లడించింది. ఈరోజు, రేపు, ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈనెల 10వ తేదీన ఉత్తర అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని సంచాలకులు తెలిపారు.

ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి 4, 5 రోజుల్లో దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తాంధ్ర తీరం చేరుకుంటుందని పేర్కొన్నారు. ద్రోణి ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలోని ఆవర్తనం నుంచి దక్షిణ కేరళ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5కిమీ ఎత్తు వరకు కొనసాగుతుందని సంచాలకులు వివరించారు. తిరోగమన నైరుతి పవనాలు ఈ రోజు వాయువ్య భారతదేశంలోని కొన్ని భాగాల నుంచి తిరోగమనం అయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు స్పష్టం చేశారు.

ఇదీచూడండి: KRMB and GRMB : 'ప్రాజెక్టుల నిర్వహణపై పూర్తి సమాచారం ఇవ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.