రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎల్లుండి మధ్య, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోని ఒకట్రెండు ప్రదేశాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ రోజు ఉపరితల ద్రోణి.. రాష్ట్రం మీదుగా సముద్ర మట్టానికి 2.1 కి.మీ. వద్ద ఏర్పడిందని వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి: CM KCR: 'ఎవరెన్ని మాట్లాడినా.. కేసీఆర్ ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు'