ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో 3.1 నుంచి 5.8 కిలో మీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతవారణ అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఈ అల్పపీడనం ప్రభావం వల్ల రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. నేడు, రేపు అక్కడక్కడా కొన్ని చోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
వచ్చే రెండు రోజుల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం
ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల రాగల రెండు రోజుల్లో వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.