నైఋతి బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. నేడు, రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. ప్రధానంగా ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని వెల్లడించింది.
ఇదీ చూడండి: పెద్దల సభకు పెద్ద పండగ.. రేపే రాజ్యసభ 250వ సమావేశం