ETV Bharat / state

Weather Report: రాష్ట్రంలో రెండురోజుల పాటు తేలికపాటి వర్షాలు - Telangana weather report

తెలంగాణలో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Weather Report) ప్రకటించింది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Weather Report
తేలికపాటి వర్షాలు
author img

By

Published : Oct 14, 2021, 3:17 PM IST

రాష్ట్రంలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని (Weather Report) హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఈరోజు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల నుంచి ఉపసంహరించాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

తూర్పు మధ్య, దాని పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనం బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలకు ఉత్తర వైపు కేంద్రీకృతమై ఉందన్నారు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి 24 గంటలలో దక్షిణ ఒడిశా- ఉత్తర కోస్తా ఆంధ్రా తీరానికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోస్తా కర్ణాటక తీరంలోని తూర్పు మధ్య అరేబియా సముద్ర పరిసర ప్రాంతాల నుంచి తెలంగాణ వరకు వ్యాపించిన ఉపరితల ద్రోణి నేడు బలహీనపడిందని సంచాలకులు వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.