ఫిట్ ఇండియా మూవ్‌మెంట్‌ని ఆదర్శంగా తీసుకుని మొదలుపెట్టిన సైకిల్ రైడింగ్ శనివారం రోజు సైనికపురి నుంచి బాలాజీ నగర్ వరకు సాగింది. లైఫ్‌సైకిల్ యూత్ ఆధ్వర్యంలో వరద బాధితులను ఆదుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో రోజుకు 20 కిలోమీటర్లు సైకిల్‌యాత్ర నిర్వహిస్తున్నట్టు యూత్ సభ్యులు పేర్కొన్నారు. ఇలా సైకిల్‌పై వెళ్తూ కొంత డబ్బును సేకరించామని తెలిపారు.
కొవిడ్ 19 కారణంగా మనం చాలా నేర్చుకోవాలని... ముఖ్యంగా ఆరోగ్యాన్ని పెంపొందిచుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సభ్యులు డా.కె.నర్సయ్య అన్నారు. అందరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో తమ స్నేహితులతో కలిసి ప్రతిరోజు సైక్లింగ్ చేస్తున్నామని సైకిల్యూత్ ప్రతినిధి అఖిలేష్ వెల్లడించారు.
ఇదీ చూడండి: గ్రామపంచాయతీల ఉల్లంఘనల పంచాయితీ..!