ETV Bharat / state

ఎల్​ఐసీని వాటాలుగా విక్రయించడం తిరోగమన చర్య: ఉద్యోగులు

ఎల్​ఐసీని వాటాలుగా విక్రయించడం తిరోగమన నిర్ణయమని ఆ సంస్థ ఉద్యోగులు తెలిపారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను 49 నుంచి 74 శాతానికి పెంచుతూ.. కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా హైదరాబాద్​లోని సౌత్ సెంట్రల్ జోనల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

lic employees concern in protest of central government decision
ఎల్​ఐసీని వాటాలుగా విక్రయించడం తిరోగమన చర్య: ఉద్యోగులు
author img

By

Published : Feb 24, 2021, 5:40 PM IST

కేంద్ర ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన ఎల్​ఐసీ విలువను వాటాలుగా విభజించి స్టాక్ మార్కెట్లో ఐపీఓ ద్వారా లిఫ్టింగ్ చేయాలన్న ప్రతిపాదనను ఆ సంస్థ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. భోజన విరామ సమయంలో హైదరాబాద్​లోని సౌత్ సెంట్రల్ జోనల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను 49 నుంచి 74 శాతానికి పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఎల్​ఐసీ ఉద్యోగులు తెలిపారు. పాలసీదారుల ప్రయోజనాలను కాపాడడానికి తామంతా సమ్మెలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఎల్​ఐసీని వాటాలుగా విక్రయించడం తిరోగమన నిర్ణయమని ఉద్యోగులు అన్నారు. 24 ఏళ్లుగా మారుమూల ప్రాంతాలకు విస్తరించి దేశ మౌలిక రంగాల అభివృద్ధి కోసం సంస్థ నిధులను సమకూర్చిందని తెలిపారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు నిలయమైన ఎల్ఐసీని ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని కోరారు. తక్షణమే విదేశీ పెట్టుబడులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: రాయలసీమ ఎత్తిపోతలపై ముగిసిన విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.