ETV Bharat / state

ధనస్సు రాశి వారికి ప్లవ నామ సంవత్సరం ఎలా ఉందంటే...

author img

By

Published : Apr 13, 2021, 12:41 PM IST

ధనస్సు రాశి వారు కొత్త ఏడాదిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి..? ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యస్థితి ఎలా ఉంటుంది. సమగ్ర వివరాలు మీకోసం..!

libra-horoscope-prediction
ధనస్సు రాశి వారికి 2021 ఎలా ఉండబోతోంది.?

ఆదాయం 11; వ్యయం 5

రాజపూజ్యం 7; అవమానం 5

ధనుస్సురాశి వారికి ఈ ఏడాది అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. అడుగడుగునా ఎదురయ్యే ఆటంకాలను బుద్ధి చతురతతో అధిగమిస్తారు. ఆర్థిక పురోగతి మిశ్రమంగా ఉంటుంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉత్తమ భవిష్యత్తును సాధించండి. ముందస్తు ప్రణాళికలు వేసుకోవడం మంచిది. సకాలంలో పనులు పూర్తిచేయండి. సమస్యను అర్థం చేసుకుంటూ తగిన పరిష్కారాన్ని వెతకండి. నిరుత్సాహాన్ని దరికి రానీయకుండా ఆలోచించండి.

నిండు మనసుతో చేసే పనులు మంచి ఫలితాన్ని ప్రసాదిస్తాయి. ధర్మమే మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని విషయాల్లో ఇది పరీక్షా కాలం. విద్యార్థులకు అలసత్వం పనికిరాదు. శ్రద్ధ పెంచాలి. బాధ్యతలను సమర్థంగా నిర్వహించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మిశ్రమ ఫలితాన్నిస్తాయి. సొంత నిర్ణయాలు లాభించవు. కుటుంబసభ్యుల సలహాలు విజయాన్నిస్తాయి. చెడును ఊహించవద్దు. శత్రువులపై విజయం సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండాలి. అంకిత భావంతో పనిచేస్తే ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు. సమాజంలో తగిన గౌరవం లభిస్తుంది. శని, గురు శ్లోకాలు చదువుకోవాలి. కార్యసిద్ధి త్వరగా లభిస్తుంది.

ఇదీ చూడండి: ప్లవ నామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకున్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.