ETV Bharat / state

72 మంది బాలకార్మికులకు విముక్తి

పాఠశాలకు వెళ్లాల్సిన వయసులో పిల్లలు గాజుల పరిశ్రమలో పనిచేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి బాలలను తీసుకొచ్చి వెట్టిచాకిరి చేయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాజుల పరిశ్రమలో పని చేస్తున్న 72 మంది బాలకార్మికులను వారి స్వస్థలాలకు పంపించారు.

72 మంది బాలకార్మికులకు విముక్తి
author img

By

Published : Aug 26, 2019, 12:48 PM IST

Updated : Aug 26, 2019, 1:42 PM IST

హైదరాబాద్​లోని బాలాపూర్‌ గాజుల తయారీ కేంద్రంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గాజుల తయారీ కేంద్రంలో బాలకార్మికులు పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పరిశ్రమలో పని చేస్తున్న 72 మంది బాలకార్మికులను పోలీసులు విముక్తి కల్పించారు. సీడబ్ల్యూ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, బాలాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో బాలకార్మికులను ప్రత్యేక బోగీలో వారి స్వస్థలాలకు తరలించారు.

బాలకార్మికులను పనుల్లో పెట్టుకుని వేధిస్తున్న వారిపై ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ గాంధీ నారాయణ పేర్కొన్నారు. కలెక్టర్ సమక్షంలో పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు. రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్​లో బాలకార్మికులు ఎవరైనా ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

ఇదీ చూడండి : 'ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుంది'

Intro:సికింద్రాబాద్ యాంకర్ .గాజుల పరిశ్రమలో పని చేస్తున్న బాలకార్మికులకు ఎట్టకేలకు పోలీసులు విముక్తి కల్పించారు. నగరంలోని రాచకొండ మరియు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 72 మంది బాలకార్మికులను వారి స్వస్థలాలకు తరలించారు పిల్లలంతా బాలాపూర్ లోని గాజుల పరిశ్రమలు పని చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సిడబ్ల్యూ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మరియు బాలాపూర్ పోలీసులు సంయుక్తంగా బాలకార్మికులను ప్రత్యేక బోగీలో వారి స్వస్థలాలకు తరలించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న వయసులో చదువుకోవాల్సిన పిల్లలను తీసుకు వచ్చి పనులు చేయించడం సరికాదన్నారు. బాలకార్మికులను పనుల్లో పెట్టుకొని వేధిస్తున్న వారిపై ఇక పై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ గాంధీ నారాయణ స్పష్టం చేశారు. కలెక్టర్ సమక్షంలో పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని వారిని పాఠశాలకు పంపి విధంగా కృషి చేస్తామన్నారు ఎంతోమంది అమాయక బాలలను తీసుకువచ్చి వారితో వెట్టిచాకిరి చేస్తున్నారని తెలిపారు తల్లిదండ్రులతో కలిసి పాఠశాలకు వెళ్లాల్సిన పిల్లలు పరిశ్రమల్లో దుర్భర స్థితిలో ఉన్నట్లు వారు పేర్కొన్నారు. రాచకొండ మరియు హైదరాబాద్ కమిషనరేట్ లో ఈ విధంగా బాల కార్మికులు ఎవరైనా ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు బాల కార్మికులను వారి చెర నుండి రక్షించి దానాపూర్ ఎక్స్ప్రెస్ లో బీహార్ కు పంపినట్లు తెలిపారు బాల కార్మిక చట్టం కింద ఎవరైతే ఉన్నారో వారి పై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు బైట్..సంధ్య.. స్వచ్ఛంద సంస్థ నాయకురాలు బైట్ గాంధీ నారాయణ ఏసిపి

Body:వంశీ

Conclusion:7032401099
Last Updated : Aug 26, 2019, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.