తెలంగాణను రెవెన్యూ సర్ ప్లస్ స్టేట్ అని ఎక్కడా చెప్పలేదని మంత్రి ఈటల రాజేందర్ శాసనమండలి సమావేశాల్లో తెలిపారు. వందకు వంద శాతం బడ్జెట్ కేటాయింపులను ఖర్చు చేసే రాష్ట్రాలు చాలాఅరుదని అన్నారు. పదేళ్ల పాలనలో కాంగ్రెస్ ఎస్సీలకు కేటాయించిన నిధుల్లో 10.99 శాతం మాత్రమే ఖర్చు చేసిందని గుర్తు చేశారు. గడిచిన నాలుగున్నరేళ్లలో తెరాస ప్రభుత్వం 14.77 నిధులను ఖర్చు చేసిందని అన్నారు. రైతు సమన్వయ సమితుల ద్వారా వ్యవసాయ సంబంధిత పనులు చేయిస్తామని పేర్కొన్నారు.
అనంతరం శాసనమండలి సమావేశాలను ఛైర్మన్ స్వామిగౌడ్ నిరవధికంగా వాయిదా వేశారు.
ఇవీ చదవండి:కోడ్ అడ్డొస్తోంది!