National Judicial Service Organization Day: ఈ ఎగ్జిబిషన్లో న్యాయ సేవాధికార సంస్థ చట్టం గురించి, న్యాయ సేవాధికార సంస్థ యొక్క పథకాలు గురించి, న్యాయ సేవాధికార సంస్థ సాధించిన విజయాల గురించి, చేయవలసిన పనుల గురించి విపులంగా అందరికీ హాజరైన విద్యార్థులకు, పానెల్ అడ్వకేట్లకు, పారా లీగల్ వాలంటీర్ ప్రజలకు, ఎన్జీవోలకు పూర్తిగా స్టాల్స్ ద్వారా వివరించడం జరిగింది. అంతేకాకుండా ఈ నెల 12వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.
సెమినార్ అనంతరం విద్యార్థులు, ఎన్జీవోలు, పారాలిగల్ వాలంటీర్లు, రంగారెడ్డి జిల్లా న్యాయవాదులు, న్యాయమూర్తులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథులుగా జిల్లా న్యాయమూర్తి హరే కృష్ణ భూపతి, మెట్రోపాలిటన్ సెషన్ జడ్జ్ ఆర్.తిరుపతి, రంగారెడ్డి జిల్లా అడ్వకేట్ బార్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీదేవి అధ్యక్షత నిర్వహించారు.
ఇవీ చదవండి: