అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాకను నిరసిస్తూ... వామపక్షాలు ఆందోళనకు దిగాయి. బేగంపేటలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం వద్ద వామపక్ష నాయకులు, కార్యకర్తలు కాన్సులేట్ ముట్టడికి ప్రయత్నం చేశారు. ప్లకార్డులతో విపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డగించి అరెస్ట్ చేసి... పీఎస్‌కు తరలించారు. విదేశీ పెత్తనం భారతదేశంపై ఉండొద్దని డిమాండ్‌తో తాము నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్లు వామపక్ష నాయకులు తెలిపారు. వెంటనే ట్రంప్ భారతదేశం నుంచి వెళ్లిపోవాలని వారు డిమాండ్ చేశారు. విదేశీ పెత్తనం మూలంగా భారతదేశం తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని నినాదాలు చేస్తూ... ఆందోళనకు దిగారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. వామపక్షాల నిరసనతో యూఎస్ కాన్సులేట్‌లోకి వెళ్లే వారిని తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తున్నారు.
ఇదీ చూడండి: ట్రంప్‌తో దావత్‌కు.. సీఎం కేసీఆర్