ETV Bharat / state

ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల తంటాలు - పోటాపోటీగా డబ్బు పంపిణీ చేస్తున్న అభ్యర్థులు - ఎన్నికల్లో డబ్బలు పంచుతున్న నేతలు

Leaders Offering Money Before Polling in Telangana : ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు ప్రలోభాల పర్వాన్ని తెర పైకి తెచ్చారు. రాష్ట్రంలో అక్రమ మద్యం, నగదు కుప్పలు తెప్పలుగా ఇప్పటికే చాలాచోట్ల పట్టుబడగా.. అభ్యర్థులు, వారి అనుచరులు సైతం హేమాహేమీగా పంపకాలు జరుపుతూ పట్టుబడ్డ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పలుచోట్ల ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఉదంతాలు వెలుగు చూశాయి. హైదరాబాద్‌లో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసుల పైనా వేటు పడింది.

Money Giving For Vote
Leaders Offering Money Before Polling in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 30, 2023, 7:11 AM IST

ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల తంటాలు

Leaders Offering Money Before Polling in Telangana : ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినప్పటికీ.. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులు, ఎన్నికల అధికారులు, ప్రత్యేక బృందాలు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించి.. రోజు కోట్ల కొద్దీ నగదు, బంగారం, వెండి, అక్రమ మద్యం, మత్తుపదార్ధాలను పట్టుకున్నారు. వీటి విలువ రూ.745 కోట్ల పైమాటేనని ఎన్నికల కమిషన్‌ పేర్కొంది.

తెలంగాణలో పోలీసుల పటిష్ఠ నిఘా - ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం - ఇప్పటివరకు రూ.737 కోట్ల సొత్తు స్వాధీనం

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మల్కీజ్ గూడ నుంచి మేడిపల్లి వైపు ఇన్నోవా వాహనంలో రూ.11 లక్షలు తీసుకెళుతుండగా స్థానికులు పట్టుకొని ఎన్నికల అధికారులకు సమాచారం అందజేశారు. మియాపూర్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్‌ నడ్డిగడ తండాలో బీఆర్ఎస్ తరఫున డబ్బులు పంచుతున్నారంటూ కొందరు అతనిపై దాడి చేశారు. దీంతో బాధితుడు మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - పోలీసుల తనిఖీల్లో రూ.724 కోట్ల సొత్తు సీజ్

Money Giving For Vote : యాదాద్రి భునవగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ప్రలోభాలకు పాల్పడుతున్నాడని కాంగ్రెస్‌ నేతలు పోలీసులకి సమాచారమిచ్చారు. వెల్దేవి, హాజీంపేట గ్రామాల్లో తనిఖీలు చేసి ఎలాంటి ఆధారాలు దొరకక పోవడంతో పోలీసులు అక్కడినుంచి వెళ్ళిపోయారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్​ నాయకులు వాహనంలో మద్యం కాటన్​లను తరలిస్తుండగా ప్రత్యేక అధికారులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.2 లక్షల 26 వేలు ఉండవచ్చు అని అంచన వేశారు.

ఎన్నికల వేళ పోలీసుల తనిఖీలు - గుట్టుగా కార్లలో తరలిస్తున్న 3.2 కోట్ల సొత్తు సీజ్

కుమురం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో ఆటోలో తరలిస్తున్న రూ.56లక్షల 48వేల నగదును పోలీసులు పట్టుకున్నారు. నగదు సీజ్ చేసి, ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో ఓటు వేసేందుకు బీఆర్ఎస్​ నేతలు డబ్బులు ఇవ్వలేదని కల్లెడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. ఏకంగా ఎమ్మెల్యే ఆరూరి రమేష్​కి ఫోన్ చేశాడు. ఈ మాటలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ఎన్నిక ప్రచారం ముగిసింది - ప్రలోభాల పర్వం ప్రారంభమైంది

విధి నిర్వహణలో పక్షపాతం, నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసు అధికారులపై వేటుపడింది. ముషీరాబాద్​లోని సంతోష్ ఎలైట్‌ అపార్ట్‌ మెంట్లో డబ్బులు పంచుతున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుల పక్షపాతాన నిలిచారనే సమాచారం మేరకు ఎన్నికల సంఘం సెంట్రల్‌ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ముషీరాబాద్ ఇన్పెక్టర్ జహంగీర్‌లను సస్పెండ్‌ చేయాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Gold Seized at Hyderabad Airport : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

గచ్చిబౌలిలో రూ.5 కోట్ల నగదు పట్టివేత, ఐటీ అధికారులకు అప్పగింత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.