రాబోయే రోజుల్లో యువతను తీర్చిదిద్దేలా లీడ్ ఇండియా ఫౌండేషన్ కృషి చేస్తుందని ఆ సంస్థ అధ్యక్షుడు పుల్లెల గోపీచంద్ తెలిపారు. మాజీ దివంగత రాష్ట్రపతి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు నివాళులర్పించారు. మనదేశ యువతకు లీడ్ ఇండియా ఫౌండేషన్ మార్గదర్శకంగా నిలుస్తుందని గోపీచంద్ ఆశాభావం వ్యక్తం చేశారు.
యువతకు ఆదర్శంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నిలిచారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. ఆయన రామేశ్వరంలో జన్మించినా.. ముస్లింగా పుట్టినా కూడా భగవద్గీతను పఠించినా వ్యక్తి అని తెలిపారు. తన జీవితంలో వివేకానంద తర్వాత ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి అబ్దుల్ కలాం అని కొనియాడారు. ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. అలాగే యువతను ప్రోత్సహించేలా కృషి చేస్తున్న లీడ్ ఫౌండేషన్‌కు తనవంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు. అబ్దుల్ కలాం చెప్పిన విధంగా "ఆప్ బడావో దేశ్ కో బడావో"అనే నినాదంతో లక్షలాది యువతను నాయకులుగా తీర్చిదిద్దారని కేవీ రమణాచారి పేర్కొన్నారు.
లీడ్ ఇండియా నేషనల్ క్లబ్స్ మనదేశంలో యువతకు మంచి మార్గదర్శకం. చాలా మంది యువత దీని ద్వారా లబ్ధి పొందడం జరిగింది. ఇంకా ఈ ప్రోగ్రాం ద్వారా చాలామంది యువత లబ్ధి పొందాలని ఆశిస్తున్నా. ఈరోజు అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుందాం. రాబోయే కాలంలో మరింత అభివృద్ధికి దోహదం చేస్తుందని కోరుకుంటున్నా. - పుల్లెల గోపిచంద్, లీడ్ ఇండియా ఫౌండేషన్ ప్రెసిడెంట్, బ్యాడ్మింటన్ కోచ్
అబ్దుల్ కలాం మనందరికీ ఆదర్శం. ఆయనను ఇవాళ స్మరించుకోవడమే గొప్ప అవకాశం. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని సమానంగా చూసిన వ్యక్తి ఆయన. ముస్లింగా జన్మించిన కూడా భగవద్గీత చదివినా వ్యక్తి. ఆయన వద్దకు ఎవరొచ్చినా కూడా వారి బాగోగులు చూసేవాడు. లీడ్ ఫౌండేషన్ చేసే కార్యక్రమాల్లో నా వంతు సహకారం అందిస్తాను. నా జీవితంలో వివేకానంద, అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకున్నా. వారు నడిచిన మార్గంలో మనం కూడా నడవాలని కోరుకుంటున్నా. భవిష్యత్తులో మరింతగా మనం అభివృద్ధిలో భాగస్వామ్యులం కావాలని ఆశిస్తున్నా. మీడియా మిత్రులు తమ జీవితాల్లో కూడా మరింత మెరుగైన అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నా. - కేవీ రమణాచారి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు
ఇదీ చూడండి: