హైదరాబాద్ ఎల్బీనగర్ ట్రాఫిక్ అదనపు ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు మరోసారి తన సేవాగుణాన్ని నిరూపించుకున్నాడు. తమ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలోని హోమ్ గార్డుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి కుటంబంలోని వారికి శస్త్ర చికిత్స సమయంలో అవసరమైన రక్తం అందించాడు.
శనివారం ఉదయం విధుల్లో ఉండగా... రక్తం అవసరమని ఫోన్ వచ్చింది. వెంటనే ఉన్నతాధికారుల వద్ద అనుమతి తీసుకుని కామినేని ఆస్పత్రికి వెళ్లి రక్తదానం చేసి వచ్చి ప్రాణాన్ని నిలబెట్టాడు. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం బాధ్యతగా భావించాలని సూచిస్తున్నాడు... అంజపల్లి నాగమల్లు. ఇప్పటివరకు సుమారు 30 సార్లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఇదీ చూడండి : రాష్ట్రం నుంచి ఇవాళ 45 వేల మంది వలస కార్మికుల తరలింపు..