హైదరాబాద్ నిమ్స్‌లో నిరవధిక దీక్ష చేస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎట్టకేలకు దీక్ష విరమించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్సరాజ్ అహీర్... లక్ష్మణ్‌తో దీక్షను విరమింపచేశారు. ఇంటర్ ఫలితాల అవకతవకలను నిరసిస్తూ లక్ష్మణ్ గత ఐదు రోజులుగా నిరవధిక దీక్షను చేశారు. ఆరోగ్యం క్షీణిస్తుండటం వల్ల దీక్ష విరమించాలని హన్సరాజ్.. లక్ష్మణ్‌ను కోరారు. పార్టీ కోర్‌కమిటీ, కేంద్రమంత్రి హన్సరాజ్ సూచన మేరకు ఆయన విరమించారు.
రేపు నిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్...
నిమ్స్‌లో దీక్ష విరమించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రేపు ఇంటికి వెళ్లనున్నారు. సాయంత్రమే వెళ్లాల్సి ఉన్నా.. ఆయనకు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. వైద్యుల సూచన మేరకు రేపు మరోసారి వైద్య పరీక్షల అనంతరం డిశ్ఛార్జ్ కానున్నట్లు సీనియర్ నేత చింతల రాంచంద్రారెడ్డి తెలిపారు.
లక్ష్మణ్ దీక్ష విరమించినా.. ఇంటర్ అక్రమాలపై తమ పోరాటం కొనసాగుతుందని కమలం నేతలు తెలిపారు.
ఇవీ చూడండి:స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవ పర్వం...