ETV Bharat / state

ఏపీలో 'లేఖ' వివాదం: ఏజీకి అశ్వినీ కుమార్ మరో ఉత్తరం

న్యాయమూర్తులపై ఆరోపణలు చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆయన సలహాదారు ఆజేయకల్లంపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించేందుకు సమ్మతి ఇచ్చే అంశాన్ని పున:పరిశీలించాలంటూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కు న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ మరో లేఖ రాశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉన్నది జగన్ రాసిన లేఖ మాత్రమేనని .. తన కోర్టు ధిక్కరణ ఫిర్యాదు కాదని పేర్కొన్నారు.

lawyer-ashwini-kumar-upadhyay-another-letter-to-attorney-general-of-india-on-cm-jagan-letter-issue
ఏపీలో 'లేఖ' వివాదం: ఏజీకి అశ్వినీ కుమార్ మరో ఉత్తరం
author img

By

Published : Nov 5, 2020, 11:21 PM IST

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణతో పాటు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా లేఖ రాసి, దాన్ని బహిరంగంగా విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజేయకల్లంలపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించేందుకు సమ్మతి ఇచ్చే అవకాశాన్ని పునః పరిశీలించాలంటూ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్​కు భాజపా నేత, సుప్రీంకోర్టు న్యాయవాది అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయ మరో లేఖ రాశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉన్నది జగన్ రాసిన లేఖేనని... కోర్టు ధిక్కరణ ఫిర్యాదు కాదని పేర్కొన్నారు. అందువల్ల కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించడానికి అనుమతి ఇవ్వాలంటూ ఏజీ కేకే వేణుగోపాల్​కు విజ్ఞప్తి చేశారు.

ఏపీ సీఎం జగన్ లేఖలో పేర్కొన్న అంశాలు కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందా లేదా నిర్ణయించే అధికారం ప్రస్తుతానికి సీజేఐకి మాత్రమే ఉన్న మాట వాస్తవమని అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ పేర్కొన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్ తరఫున అజేయకల్లం లేఖను మీడియాకు విడుదల చేశారని గుర్తు చేశారు. సీజేఐకి రాసిన లేఖ ప్రైవేట్ విషయం అయినప్పటికీ... మరో సహ పాత్రధారి తెరమీదకు వచ్చి అదనపు ప్రకటన చేశారని ఏజీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల్లో న్యాయమూర్తులపై అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారని.. ఇది ప్రాథమికంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని పేర్కొన్నారు.

లేఖ తదనంతరం పరిణామాలు ప్రధాన న్యాయమూర్తి ముందున్న ఫిర్యాదులో భాగం కాదని.. సీఎం జగన్ న్యాయవ్యవస్థకి వ్యతిరేకంగా చేసిన ఫిర్యాదే సీజేఐ ముందున్నదని తెలిపారు. ఈ కేసులో జగన్, అజేయకల్లంది కోర్టు ధిక్కరణ ధోరణేనని ఏజీ ప్రాథమికంగా అభిప్రాయపడినందున... తదుపరి చర్యలకు ఉపక్రమించడానికి అనుమతి ఇవ్వడం అత్యవసరమని ఉపాధ్యాయ అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థ ముప్పేట దాడికి గురవుతున్న సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని న్యాయవాది లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఆ పరిస్థితిని కేసీఆర్ ప్రభుత్వం కొనితెచ్చుకోవద్దు: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.