రైతు వద్ద లంచం తీసుకుంటూ పట్టుబడిన కేశంపేట తహసీల్దార్ లావణ్య, కొందుర్గు వీఆర్వో అనంతయ్యకు అనిశా కస్టడీ ముగిసింది. వారిద్దరిని రెండు రోజుల కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, ఎవరెవరి దగ్గర లంచాలు స్వీకరించారు అనే కోణంలో ప్రశ్నించారు. సోదాల సమయంలో లావణ్య నివాసంలో లభ్యమైన 93 లక్షల రూపాయలతో పాటు ఆమె తండ్రి ఇతర బంధువుల ఖాతాల్లో గుర్తించిన నగదు తదితర అంశాలపై వారిని ఆరా తీశారు. కస్టడీ ముగిసిన అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల చేయించి తిరిగి లావణ్య, అనంతయ్యలను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఇదీ చూడండి : దిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కన్నుమూత