కరోనా మహామ్మారి రెండో దశ నేపథ్యంలో ప్రజలకు కావాల్సిన పూర్తి సమాచారం అందించేందుకు కో-హెల్ప్ యాప్, వైబ్‌సైట్‌ను సాగర్ సాప్ట్‌వేర్ సొల్యూషన్ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ లక్డీకపూల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర జీవవైవిధ్య మండలి సభ్య కార్యదర్శి కాళీ చరణ్, సాగర్ సాప్ట్‌వేర్ సొల్యూషన్ సంస్థ సీఈవో జోగి రితేష్ వెంకట్ ఆవిష్కరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని బెడ్స్, ఆక్సిజన్, వ్యాక్సిన్ తదితర విషయాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించనున్నారు.
విపత్కర కాలంలో ప్రజలకు ఉపయోగపడే సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఐఏఎస్ అధికారి కాళీ చరణ్ అన్నారు. ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమాచారాన్ని ఉచితంగా అందిస్తామని సాగర్ సాప్ట్‌వేర్ సొల్యూషన్ సంస్థ సీఈవో జోగి రితేష్ వెంకట్ తెలిపారు. సుమారు నాలుగు వేలకు పైగా ఆస్పత్రుల సమాచారం అందుబాటులో ఉందని వెల్లడించారు. ప్రైవేటు ఆస్పత్రులు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. త్వరలోనే దేశవ్యాప్తంగా తమ సేవలను విస్తరిస్తామని వివరించారు. www.cohelp.info సమాచారం పొందవచ్చని సూచించారు.
ఇదీ చదవండి: మురుగుతో నగరాలు విలవిల