గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 28,254 నమూనాలను పరీక్షించగా.. 79 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. 87 మందికి కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో కోటీ 32 లక్షలకు పైగా కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్టు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 8,88,178 మందికి కరోనా సోకినట్లు పేర్కొంది. వారిలో 8.79 లక్షల మందికిపైగా కోలుకున్నారని తెలిపింది. ఇప్పటి వరకు మెుత్తం 7,157 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది.
- ఇదీ చూడండి : పేద, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ఏమి చేయదా?