వారి లక్ష్యం దేవాలయాలే... ఆ ప్రాంతంలో ఆటో రిక్షాలో తిరుగుతూ.. గుడికి వచ్చే భక్తులు, పూజారి కదలికలు గమనిస్తారు. అదును చూసి రాత్రుళ్లు ఆలయాల్లోకి వెళ్లి…దర్జాగా హుండి తాళాలు పగలగొట్టి నగదును వాటాలేసుకుని మరీ ఇద్దరు సమానంగా దోచేస్తారు. హైదరాబాద్ లంగర్ హౌస్ పరిధి ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న జంట చోరుల పనితీరిది.
లంగర్ హౌస్‌లోని మారుతి నగర్ వద్ద ఉన్న గౌరీ శంకర్ మారుతి దేవాలయం ఆలయంలో గత నెల ఇదే తీరులో దొంగతనం జరిగింది. ఆలయ పూజారి వదలి మార్కండయ శర్మ(ప్రేమ్ సాయి) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు పోలీసులు. ప్రత్యేక బృందంగా ఏర్పడి మారుతి నగర్ నుంచి హాబీబ్ నగర్ వరకు సీసీ కెమెరాలను పరిశీలించారు. నిఘా నేత్రాలకు చిక్కిన జంట దొంగలు షేక్ ఈసా, సయ్యద్ అహ్మద్ హుస్సేన్‌లను పోలీసుసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి ఒక ఆలయ హుండీ, ఒక ఆటో రిక్షా, ఒక ఇసుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు తరలించారు. టప్పాచబుత్రాకు చెందిన షేక్ ఈసా బైక్ మెకానిక్ కాగా… సయ్యద్ అహ్మద్ హుస్సేన్ టోలిచౌకి వాసి. ఇతను ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. వీరి పై గతంలో కూడా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ో కేసు ఉందని వివరించారు.
ఇవీ చదవండి: వాహనదారుల దుశ్చర్యలు... కఠిన చర్యలు తప్పవంటున్న పోలీసులు