ETV Bharat / state

Ramanachary: కరోనా సమయంలో పాత్రికేయుల సేవలు అభినందనీయం - హైదరాబాద్​ తాజా వార్తలు

కరోనా విపత్కర సమయంలో పాత్రికేయులు విశేష సేవలు అందిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్ కేవీ రమణాచారి(Ramanachary) అన్నారు. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సమాచారం అందిస్తూ బృహత్తర సేవలు చేస్తున్నారని అభినందించారు.

Ramanachary: కరోనా సమయంలో పాత్రికేయుల సేవలు అభినందనీయం

author img

By

Published : Jun 4, 2021, 6:13 PM IST

ప్రజలకు నిరంతరం సమాచారం అందించే పాత్రికేయుల సేవలు అభినందనీయమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్ కేవీ రమణాచారి(Ramanachary) అన్నారు. సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 30 మంది పాత్రికేయులకు ప్రశంసా పత్రం, నగదు ప్రోత్సాహకాలు ఆయన అందించారు.

కరోనా క్లిష్ట సమయంలో అన్ని రంగాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. పాత్రికేయులను గుర్తించి ప్రోత్సహించడం గొప్ప విషయమన్నారు. నిరుపేద జానపద కళాకారులకు సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ కొండంత అండగా నిలిచిందని గుర్తు చేశారు. సామాజిక బాధ్యతగా సాయం చేస్తున్నానని కళాపోషకులు సారిపల్లి కొండలరావు అన్నారు. సమాజానికి పాత్రికేయులు చేస్తున్న సేవలను కొనియాడారు.

ఇదీ చదవండి: KTR: కేంద్ర అనాలోచిత నిర్ణయాల వల్లే వ్యాక్సిన్​ ఆలస్యం: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.