ETV Bharat / state

'ప్రార్థించే చేతుల కన్నా సాయం చేసే చేతులు మిన్న' - ఆక్సిజన్​ కాన్సెంట్రేటర్​

వాషింగ్టన్​లోని మన కోసం ఫౌండేషన్​ సభ్యులు ఉదారతను చాటుకున్నారు. 7 లీటర్ల కెపాసిటీ గల ఆక్సిజన్​ కాన్సెన్​ట్రేటర్ల​ను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్​కు ఉచితంగా అందించారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో చేసిన ఈ సాయాన్ని అభినందించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్​ అధ్యక్షుడు డాక్టర్​ కేవీ రమణాచారి.

manakosam foundation, ramanachary, ts govt
manakosam foundation
author img

By

Published : Jun 10, 2021, 4:47 PM IST

ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు.

వాషింగ్టన్​లోని 'మన కోసం ఫౌండేషన్' సభ్యులు భారతీయ సేవా సమితి ఫౌండేషన్ విజ్ఞప్తి మేరకు.. ఏడు లీటర్ల కెపాసిటీ గల ఆక్సిజన్ కాన్సెన్​ట్రేటర్ల​ను ఈ సందర్భంగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్​కు ఉచితంగా అందజేశారు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు వేణుగోపాల చారి, బిఎస్​ఎస్​ఎఫ్ సభ్యులు శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

'మంచి ఆలోచన..'

కరోనా మహమ్మారి కారణంగా.. ఆక్సిజన్ కొరతతో అనేకమంది చనిపోయారని, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆక్సిజన్ కాన్సెన్​ట్రేటర్ల​ను ఉచితంగా డొనేట్ చేసి మంచి చేయాలనే ఆలోచనతో.. ముందుకొచ్చిన మన కోసం ఫౌండేషన్, బిఎస్​ఎస్​ఎఫ్ వారిని కేవీ రమణాచారి అభినందించారు. పేద బ్రాహ్మణులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని.. ఫోన్ చేసి తమ వివరాలను అందించి ఈ ఆక్సిజన్ కాన్సెన్​ట్రేటర్ల​ను ఉపయోగించుకొని తరువాత మళ్లీ సంక్షేమ పరిషత్​కు అందించాలని సూచించారు.

ఇదీ చూడండి: కరోనా సోకిన మామను భుజాలపై మోస్తూ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.