ETV Bharat / state

'బ్రాహ్మణులకు ఆర్థిక సాయం చేస్తున్నామనడం అవాస్తవం'

ఉపాధి కోల్పోయిన బ్రాహ్మణులకు ఆర్థిక సహాయం చేస్తున్నామని వచ్చే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి వెల్లడించారు. లాక్​డౌన్ కారణంగా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న పేద బ్రాహ్మణులకు.. బ్రాహ్మణ సేవా వాహిని ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేశారు.

kv ramana chary groceries distribution to the poor brahmins in hyderabad
'బ్రాహ్మణులకు ఆర్థిక సాయం చేస్తున్నామనడం అవాస్తవం'
author img

By

Published : Jul 26, 2020, 3:37 PM IST

ఉపాధి కోల్పోయిన బ్రాహ్మణులకు ఆర్థిక సహాయం చేస్తున్నామనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని పరిషత్ ఛైర్మన్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి తెలిపారు. కొంత మంది మధ్య దళారులు చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. బ్రాహ్మణ సేవా వాహిని మహిళా విభాగం ఆధ్వర్యంలో... హైదరాబాద్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన నిరుపేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

అనంతరం దిల్లీలో తెరాస ప్రతినిధి వేణు గోపాలచారి, సేవా వాహిని అధ్యక్షుడు శేషం రఘు కిరణ్ చారి, మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రితో కలిసి ఆయన వంద మంది పేద బ్రాహ్మణులకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. కరోనా సమయంలో అన్ని వర్గాల ప్రజలు అన్ని రకాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ఇవీ చూడండి: పీపీఈ కిట్లపై నిర్లక్ష్యం.. జంతువుల పాలిట శాపం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.