ETV Bharat / state

'రానా నాయుడు'​పై కూనంనేని ఫైర్.. వెబ్ సిరీస్​లను సెన్సార్ పరిధిలోకి తేవాలని డిమాండ్

author img

By

Published : Mar 19, 2023, 7:58 PM IST

అసభ్య పదజాలం, బోల్డ్ కంటెంట్ తో రానానాయుడు సినిమా ఉందని ఇలాంటి సినిమాలు ఓటీటీలో ఉండొద్దని సీపీఐ స్టేట్ ప్రెసిడెంట్ అన్నారు. మీర్జాపుర్, రానా నాయుడు లాంటి సినిమాలను ఓటీటీల నుంచి తీసేయాలని.. వెబ్ సిరీస్ కూడా సెన్సార్ పరిధిలోకి రావాలని డిమాండ్ చేశారు.

kunamneni samshivarao fires on rananaidu movie
రానా నాయుడు సినిమాపై కూనంనేని ఫైర్

ఎన్నో ఆశలతో వచ్చి కాంట్రవర్శియల్ అయిన వెబ్ సిరీస్ రానా నాయుడు. దీనిని ఒటీటీ నుంచి తీసేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేశారు. అసభ్య పదజాలం, బోల్డ్ కంటెంట్ ఉన్న రానా నాయుడు, మీర్జాపుర్ లాంటి సినిమాలను ఓటీటీల నుంచి తీసేయాలని.. వెబ్ సిరీస్ కూడా సెన్సార్ బోర్డు పరిధిలోకి రావాలని కూనంనేని సాంబశివరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

ఓటీటీ ప్లాట్ ఫామ్​లో ప్రసారమవుతున్న రానా నాయుడు, మీర్జాపూర్ వంటి వెబ్ సిరీస్ ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ముఖ్యంగా తెలుగు ప్రజలకు మంచి కుటుంబ కథా చిత్రాలు అందించిన దగ్గుబాటి రామా నాయుడు కుటుంబ సభ్యుల నుంచి రానా నాయుడు వంటి వెబ్ సిరీస్ రావడం దురదృష్టకరమన్నారు. అందులో అశ్లీల డైలాగులను దగ్గుబాటు వెంకటేశ్, రానా మాట్లాడడం కుటుంబ మర్యాద భంగం కలిగేలా ఉందని వ్యాఖ్యానించారు. ఓటీటీలపై నియంత్రణ, సెన్సార్ షిప్ లేకపోవడంతో అశ్లీల సన్నివేశాలు, డైలాగులు విశృంఖలంగా ప్రసారం చేస్తున్నారని, దీంతో యువత పెడదోవ పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పైగా ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ ఉండడంతో ఓటీటీల ద్వారా వెబ్ సిరీస్ మారుమూల పల్లెల్లో సైతం సులువుగా వీక్షించేందుకు సౌలభ్యం కలిగిందని, దీంతో విష సంస్కృతి కింది వరకు వేగంగా పాకిపోతున్నదన్నారు. ఇది మంచిది కాదని, తక్షణమే వెబ్ సిరీస్ కూడా సెన్సార్ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ముఖ్యంగా రానా నాయుడు వెబ్ సిరీస్ ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మనందరికీ వెంకటేశ్ అంటే వెంటనే గుర్తొచ్చేది 'సూర్యవంశం', 'నువ్వు నాకు నచ్చావ్' లాంటి సినిమాలు. ఆ సినిమాలలో ఒక మంచి తండ్రిగా, బాధ్యతగల కొడుకుగా ఆ పాత్రలలో ఒదిగిపోయాడు. లేటెస్ట్ గా దశ్యం, ఎఫ్2, ఎఫ్3 లాంటి థ్రిల్లర్, కామెడీ సినిమాలతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన వెంకటేశ్ రానా నాయుడు సినిమాతో పెద్ద ప్రయోగమే చేశాడు. ఈయన సినిమాలంటే ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంతో కనెక్ట్ అవుతారు. కానీ ఈసారి ఈయన వినూత్నంగా ప్రయత్నించాడు. రానా దగ్గుబాటి కూడా మంచి సినిమాలతో ఎన్నో హిట్ లు కొట్టాడు. వెంకటేశ్, రానా కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు వీరిపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అయితే బోల్డ్ కంటెంట్, అసభ్య పదజాలం ఈ వెబ్ సిరీస్ కు మాయని మచ్చగా మిగిలిందని సినీ ప్రియులు వాపోతున్నారు. కుటుంబసభ్యులు మొత్తం కాకుండా కేవలం ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తీసినట్లుగా ఉందని విమర్శలు వస్తున్నాయి.

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.