ETV Bharat / state

లింక్​రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కృష్ణారావు

author img

By

Published : May 14, 2020, 1:24 PM IST

Updated : May 14, 2020, 9:22 PM IST

కూకట్​పల్లి నుంచి ఔటర్​ రింగ్​ రోడ్డు వరకు నిర్మిస్తున్న లింక్​రోడ్డు పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు. పనుల పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. లాక్​డౌన్​ సమయాన్ని సద్వినియోగం చేసుకుని వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు.

kukatpally
లింక్​రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

హైదరాబాద్​ నగరంలో ట్రాఫిక్​ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లింక్​ రోడ్డు నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్​పల్లి, హైదర్​నగర్​ నుంచి ఔటర్​రింగ్​ రోడ్డు వరకు నిర్మాణంలో ఉన్న లింక్​రోడ్డు పనులను జీహెచ్​ఎంసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.

లింక్ ​రోడ్డు నిర్మాణానికి స్థానిక ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. నియోజకవర్గంలో మిగతా చోట్ల చేపట్టిన రోడ్లు, వంతెన నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు.

'హైదరాబాద్​లో ట్రాఫిక్​ సమస్యను దృష్టిలో పెట్టుకుని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లింక్​రోడ్ల నిర్మాణానికి ఆదేశాలిచ్చారు. వీటికోసం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వేగంగా నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. నిర్మాణంలో ఉన్న లింక్​రోడ్లన్నీ అందుబాటులోకి వస్తే కూకట్​పల్లిలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ప్రజలందరూ సహకరిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న బాలనగర్​ వంతెనను కూడా జూలైలోగా అందుబాటులోకి తీసుకొస్తాం. హైదరాబాద్​ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న రోడ్లన్నీ ప్రారంభమైతే ట్రాఫిక్​ సమస్యకు పరిష్కారంలో దేశానికే భాగ్యనగరం ఆదర్శంగా నిలుస్తోంది. ​​'-ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

లింక్​రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కృష్ణారావు

ఇవీ చూడండి: బ్లాక్​ పాంథర్​ కాదది.... మానుపిల్లే... !!

Last Updated : May 14, 2020, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.