- ఇదీ చూడండి: రాణి జీవితం అందరికీ ఆదర్శణీయం!
కూచిపూడి, పేరిణి నృత్యంలో ప్రతిభ చూపుతున్న నాట్య మయూరి
పేరిణి...! తెలుగువారి ప్రాచీన నృత్యం. శివతాండవంగా... యోధుల నృత్యంగా పూర్వకాలం నుంచి అందరిని మెప్పించిన ఈ నాట్యం...ఆ తరువాత కాలంలో ఆదరణ కోల్పోయింది. కాకతీయుల హయాంలో బాగా విరాజిల్లిన...ఈ నృత్యంపై మళ్లీ ఇప్పటి యువతరం ఆసక్తి పెంచుకుంటున్నారు. ప్రత్యేకశ్రద్ధతో నేర్చుకుని ప్రదర్శనలిస్తున్నారు. అలాంటి కళాకారుల్లో ముందువరుసలో ఉంటుంది... హైదరాబాద్‌కు చెందిన నాగదుర్గ. నాలుగో ఏటనే కూచిపూడిలో శిక్షణ తీసుకున్న ఈ యువతి పేరిణి లాస్య కళాకారిణిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. శిక్షకురాలిగా మారి చిన్నారులకు ఈ సంప్రదాయ నాట్యాన్ని చేరువ చేస్తున్న ఈ యువ ప్రతిభాశాలితో ఈటీవీ ముఖాముఖి.
కూచిపూడి, పేరిణి నృత్యంలో ప్రతిభ చూపుతున్న హైదరాబాదీ
- ఇదీ చూడండి: రాణి జీవితం అందరికీ ఆదర్శణీయం!