ETV Bharat / state

కేయూ విద్యార్థి సునీల్ నాయక్​ది ప్రభుత్వ హత్యే: రేవంత్

కేసీఆర్ కుటుంబ వైభోగం కోసం యువత ఇంకెన్నాళ్లు బలిదానాలు చేయాలని ప్రశ్నించారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి. కేయూ విద్యార్థి సునీల్ నాయక్​ది ప్రభుత్వ హత్యేనని ఆయన ఆరోపించారు.

Mp revanth reddy
రేవంత్ రెడ్డి ఫైర్
author img

By

Published : Apr 2, 2021, 7:12 PM IST

కేయూ విద్యార్థి సునీల్ నాయక్​ది ప్రభుత్వ హత్యేనని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో విద్యార్థులను రెచ్చగొట్టి వారి చావులకు కారణమయ్యారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వక మరోసారి వారి చావులకు కారణమవుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ వైభోగం కోసం యువత ఇంకెన్నాళ్లు బలిదానాలు చేయాలని ప్రశ్నించారు.

రాష్ట్రంలో లక్షా 91 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ చెప్పిందని... ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన టీఎస్​పీఎస్​సీ కమిటీకే దిక్కులేదని ఆరోపించారు. రెండోసారి అధికారంలోకి వచ్చి 27 నెలలైనా నిరుద్యోగ భృతి ఊసేలేదన్నారు. తక్షణం లక్షా 91 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో యువతను కూడగట్టి ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.

  • కేయూ విద్యార్థి సునీల్ నాయక్ ది ప్రభుత్వ హత్యే...రాష్ట్రంలో లక్షా 91 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ చెప్పింది...రెండోసారి అధికారంలోకి వచ్చి 27 నెలలైనా నిరుద్యోగ భృతి అతీగతీ లేదు....తక్షణం లక్షా 91 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలి...!#justiceforsunilnayak pic.twitter.com/iLFXE9IkFW

    — Revanth Reddy (@revanth_anumula) April 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: యావత్‌ దేశాన్ని ఆకర్షిస్తున్న సంప్రదాయ కంబళ క్రీడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.