ETV Bharat / state

కేసీఆర్ మెడికల్ కాలేజీల బదులు యూట్యూబ్ ఛానెళ్లు పెట్టాల్సింది : కేటీఆర్ - KTR Youtube Channel Tweet

KTR Tweet Today : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 32 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసే బదులు తనకోసం 32 యూట్యూబ్ ఛానెల్స్ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ సలహా పలువురు నెటిజన్ల నుంచి వచ్చిందని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

KTR
KTR Tweet Today
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 31, 2023, 2:01 PM IST

KTR Tweet Today : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్. మంత్రిగా ఉన్న సమయంలో ఆయన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రజా సమస్యలపై స్పందించేవారు. అక్కడికక్కడే సదరు సమస్యలను సంబంధిత అధికారులను ట్యాగ్ చేసి పరిష్కరించాలని ఆదేశించేవారు. మరోవైపు ఎక్స్ వేదికగానే ఆయన రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని వివరించే వారు. అలాగే ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించే వారు.

KTR Tweet On Congress Govt : ఇప్పుడు ఆయన మంత్రి పదవిలో లేరు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఇప్పుడు కూడా ఆయన నెట్టింట చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రభుత్వ తీరును ఎక్స్ వేదికగా సమయం వచ్చినప్పుడల్లా ఎండగడుతున్నారు. అదే విధంగా కేసీఆర్ సర్కార్‌పై, తమ పార్టీపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలను తిప్పి కొడుతున్నారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీలు, అభయహస్తం హామీల అమల్లో జాప్యాన్ని ఎక్స్ వేదికగా నిలదీస్తున్నారు.

  • Lots of Interesting feedback & observations I’ve been getting post election results

    The best one thus far;

    Instead of setting up 32 Govt Medical Colleges, KCR Garu should’ve setup 32 YouTube channels to counter the fake propaganda

    Agree with this observation to an extent

    — KTR (@KTRBRS) December 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

KTR Tweet On KCR Today : ఇక తాజాగా కేటీఆర్ కేసీఆర్‌పై జరుగుతున్న నెగిటివ్ ప్రచారాన్ని ఎక్స్‌లో పోస్టు చేసి తిప్పికొట్టారు. ఎన్నికల తర్వాత తనకు చాలా రకాల ఫీడ్‌బ్యాక్‌లు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు. అయితే అందులో తనకు చాలా ఆసక్తికరంగా అనిపించిన ఓ ఫీడ్‌బ్యాక్‌ను ఇవాళ ఆయన పోస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసే బదులు కేసీఆర్ 32 యూట్యూబ్ ఛానెల్స్ క్రియేట్ చేసుకుని ఉంటే బాగుండేదని పలువురు నెటిజన్లు సలహా ఇచ్చినట్లు కేటీఆర్ చెప్పారు. కనీసం ఆ ఛానెళ్లు కేసీఆర్‌పై వస్తున్న నకిలీ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఉపయోగపడేవని తెలిపారు.

కేసీఆర్ 22 ల్యాండ్ క్రూయిజర్లు కొని విజయవాడలో దాచారు : సీఎం రేవంత్

Netizens Comments on KTR Tweet : ప్రస్తుతం కేటీఆర్ ట్వీట్ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరేమో కేసీఆర్‌కు మద్దతు పలుకుతూ "నిజమే కేటీఆర్ జీ మెడికల్ కాలేజీలతో పాటు యూట్యూబ్ ఛానెళ్లు కూడా కేసీఆర్ ఏర్పాటు చేయాల్సింది. ఇప్పుడు ఈ నెగిటివ్ ప్రచారాన్ని అరికట్టేందుకు ఉపయోగపడేవి. ఈ యూట్యూబ్ క్యాంపెయినింగే పార్టీకి నష్టం కలిగించింది. దీన్ని నమ్ముకుని ఉంటే మనకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవి" అని కేటీఆర్ ట్వీట్‌పై కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరేమో బీఆర్ఎస్ పార్టీ ఓటమి నుంచి ఏం నేర్చుకోలేదని మండిపడుతున్నారు. "నకిలీ ప్రచారం అని చెప్పుకునే బదులు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ప్రజాసేవ చేస్తే బాగుండేది . ఇంకో విషయమేంటంటే ఈ నకిలీ ప్రచారం అనే ఫీడ్‌బ్యాక్ మీ బీఆర్ఎస్ కార్యకర్తల నుంచే వచ్చి ఉంటుంది కేటీఆర్ జీ" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

లోక్​సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ - న్యూ ఇయర్ తర్వాత కేసీఆర్ బాస్ వస్తారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.