KTR on Telangana Congress Six Guarantees : కర్ణాటకలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం "రాజకీయ ఎన్నికల పన్ను(Political poll tax)" విధించడం ప్రారంభించిందని మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. బెంగళూరు బిల్డర్లకు చదరపు అడుగుకు రూ.500ల చొప్పున పన్ను విధిస్తూ.. కర్ణాటక ప్రభుత్వం నిధుల సేకరణ చేస్తుందని అన్నారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ స్కాంల వారసత్వంతో స్కాంగ్రెస్‌గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. కర్ణాటక నిధులను తీసుకొచ్చి తెలంగాణలో ఎంత వెదజల్లినా తెలంగాణ ప్రజలను మోసం చేయలేరన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు స్కాంగ్రెస్‌ను తిరస్కరిస్తారని మంత్రి కేటీఆర్(KTR On Congress) ధీమా వ్యక్తం చేశారు.
"కర్ణాటక కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు రాజకీయ ఎన్నికల పన్ను విధిస్తోంది. బెంగళూరు బిల్డర్లకు చదరపు అడుగుకు రూ.500 చొప్పున పన్ను విధించి.. నిధులు సేకరణ చేపడుతుంది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ స్కాంల వారసత్వంతో స్కాంగ్రెస్‌గా మారింది. అక్కడి నిధులు తెచ్చి తెలంగాణలో వెదజల్లినా అధికారంలోకి రాదు." - కేటీఆర్, రాష్ట్ర మంత్రి
-
Apparently Karnataka’s newly elected Congress Government has started levying a “political election tax” of ₹500 per Square Foot to Bengaluru builders to fund Telangana Congress 😁
— KTR (@KTRBRS) September 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Old habits die hard. The Grand old party and its rich legacy of Scams is legendary and that’s why…
">Apparently Karnataka’s newly elected Congress Government has started levying a “political election tax” of ₹500 per Square Foot to Bengaluru builders to fund Telangana Congress 😁
— KTR (@KTRBRS) September 30, 2023
Old habits die hard. The Grand old party and its rich legacy of Scams is legendary and that’s why…Apparently Karnataka’s newly elected Congress Government has started levying a “political election tax” of ₹500 per Square Foot to Bengaluru builders to fund Telangana Congress 😁
— KTR (@KTRBRS) September 30, 2023
Old habits die hard. The Grand old party and its rich legacy of Scams is legendary and that’s why…
KTR Fires on Congress Party : ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై అవకాశం దొరికినప్పుడల్లా.. మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునే ఉద్దేశంతో.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఎవరో తెలియని పార్టీ.. ఆరు గ్యారెంటీలను ఎలా ప్రకటించిందో అంటూ ఎద్దేవా చేశారు. దేశంలో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా.. ప్రకటించిన పథకాలను అమలు చేయలేని దుస్థితిలో హస్తం పార్టీ ఉందన్నారు. అలాంటిది తెలంగాణలో ఎవరి డబ్బు తీసుకువచ్చి.. గ్యారెంటీ పథకాలను అమలు చేస్తారని ధ్వజమెత్తారు.
Telangana Congress Six Guarantees Scheme : కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అవకాశం ఇస్తే మళ్లీ.. కటిక చీకట్లు, తాగునీటి ఇక్కట్లు తప్పవని కేటీఆర్ అన్నారు. కటిక చీకట్లు, ఎరువులు, విత్తనాల కోసం కష్టాలు, తాగునీటి ఇక్కట్లు అంటూ ఇవి ఆ పార్టీ గ్యారెంటీలు అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే.. ఇప్పుడు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అన్ని పథకాలకు రాంరాం పాడడం గ్యారెంటీ అంటూ భంగుమన్నారు. ఎంతసేపు ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడే హస్తం పార్టీ.. ఎప్పుడైనా అభివృద్ధి విషయంపై మాట్లాడిందా అంటూ ఘాటుగానే ప్రశ్నించారు.