ETV Bharat / state

KTR Tweet on PM Modi : 'మోదీ జీ.. మా 3 ప్రధాన హామీల సంగతేంటి?'

KTR Tweet on PM Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెలలో రెండో సారి వస్తున్న సందర్భంగా.. రాష్ట్రానికి ఏం చేశారని నిలదీస్తూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ ఎక్స్​(ట్విటర్​)లో ట్వీట్​ చేశారు. కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం ఊపిరి తీశారని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్ట్​కు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మూడు ప్రధాన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పక్కా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

KTR Tweet On PM Modi
KTR Tweet on Modi promises in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2023, 12:36 PM IST

KTR Tweet on PM Modi : నిత్యం సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉండే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​.. మరోసారి ఎక్స్​ (ట్విటర్) వేదికగా ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మూడు ప్రధాన సమస్యలపై మోదీ స్పందించాలని కేటీఆర్ డిమాండ్​ చేశారు. ప్రధాని మోదీ ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా పర్యటనలో పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీని ప్రకటించారని.. మరి ఇవాళ నిజామాబాద్​లో పర్యటించనున్నందున.. ఈరోజు ఏం ప్రకటన చేస్తారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలో ప్రధాన మంత్రి.. తెలంగాణ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ప్రధాన మంత్రి నిజామాబాద్ పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా 3 ప్రధాన హామీల గురించి ప్రశ్నలు లేవనెత్తారు. ఆ హామీలు ఏంటంటే..

  • వరంగల్​ జిల్లాలోని కాజీపేట్​ కోచ్​ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు
  • బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు
  • పాలమూరు ప్రాజెక్ట్​కు జాతీయ హోదా దక్కేదెప్పుడు అని ప్రశ్నించారు.

KTR Tweet About AP Reorganization Act Guarantees : 'ఏపీ పునర్విభజన చట్టం హామీలు ఎటు పోయాయి'

  • ప్రధాని @narendramodi గారు...
    మా మూడు ప్రధాన హామీల సంగతేంటి...???

    1. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు ?

    2. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు ?

    3. మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడు ?

    మూడురోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్నరు…..మరి.. ఆ…

    — KTR (@KTRBRS) October 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

KTR Questions Modi promises To Telangana : మూడు రోజుల వ్యవధిలో రెండోసారి రాష్ట్రానికి వస్తున్రాని.. మరి ఆ మూడు విభజన హక్కులకు దిక్కేదని మంత్రి కేటీఆర్ మోదీని నిలదీశారు. పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర జరిపిస్తారని మండిపడ్డారు. గుండెల్లో గుజరాత్​ని పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా అంటూ ఫైర్ అయ్యారు. లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చే ఐటీఐఆర్​ను ఆగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR Tweet On Postponement TSPSC Group-2 Exam : గ్రూప్‌- 2 పరీక్ష రీషెడ్యూల్‌కు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం

"మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు.. ?? మీ పసుపు బోర్డు ప్రకటన కూడా.. మహిళా రిజర్వేషన్ మాదిరిగానే ఉంది. ఎన్నికల వేళ హంగామా ఇప్పుడు.. మరి అది అమలు అయ్యేది ఎప్పుడో. ప్రధానిగా మీ పదేళ్ల పాలనలో.. అదానికి తప్ప.. ఆమ్ ఆద్మీకి దక్కిందేంటి..! మా మూడు ప్రధాన హామీలు నెరవేర్చకపోతే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పక్కా..! మళ్లీ వంద స్థానాల్లో మీ డిపాజిట్లు గల్లంతవడం గ్యారెంటీ..! " - కేటీఆర్​, ఐటీ శాఖ మంత్రి

KTR Fires on PM Modi Nizamabad Tour : మోదీ పదేళ్ల పాలనలో.. 4 కోట్ల తెలంగాణ ప్రజలనే కాదు.. 140 కోట్ల భారతీయులనూ మోసం చేశారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ సందర్భంగా మోదీ చేసిన హామీలను గుర్తు చేశారు. 2022 కల్లా రైతుల ఆదాయం డబుల్.. దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు.. పెట్రోల్ ధరలు నియంత్రణ.. ఇలాంటి హామీలు నెరవేరలేదని తెలిపారు. 'మోదీ జీ మీ దోస్తుకు ఇచ్చిన హామీలు తప్ప.. దేశ ప్రజలకిచ్చిన ఒక్క మాటను నెరవేర్చరా' అని ప్రశ్నించారు.

KTR on Telangana Congress Six Guarantees : 'గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. స్కాంల వారసత్వంతో స్కాంగ్రెస్ అయింది'

KTR On Palamuru Rangareddy Project : 'ఎదురుచూపులు ఫలించే వేళ.. పల్లేర్లు మొలిచిన పాలమూరులో పాలనురగల జలహేల'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.