KTR Tweet on MP Kotha Prabhakar Reddy Attack : సిద్దిపేట జిల్లా దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి ఘటన రాష్ట్రంలో తీవ్ర కలవరం రేపిన సంగతి తెలిసిందే. ఆయనపై దాడి వెనుక ఏ పార్టీ, ఎవరు ఉన్నారనేది పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ మరోసారి ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్ గూండానే అంటూ ఆరోపించారు. ఈ మేరకు ఆ పార్టీ కండువాతో ఉన్న నిందితుడి ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు. ఇంకా ఆధారాలు కావాలా అని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు.
-
The Congress Goon who unleashed the murder attack on MP Prabhakar Reddy yesterday
— KTR (@KTRBRS) October 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Do you need more proofs Rahul Gandhi ? pic.twitter.com/HceItfzvUL
">The Congress Goon who unleashed the murder attack on MP Prabhakar Reddy yesterday
— KTR (@KTRBRS) October 31, 2023
Do you need more proofs Rahul Gandhi ? pic.twitter.com/HceItfzvULThe Congress Goon who unleashed the murder attack on MP Prabhakar Reddy yesterday
— KTR (@KTRBRS) October 31, 2023
Do you need more proofs Rahul Gandhi ? pic.twitter.com/HceItfzvUL
KTR Accuses Congress Over Attack on MP Prabhakar Reddy : కత్తిపోటుకు గురై సికింద్రాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని మంత్రి కేటీఆర్ సోమవారం పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా నిరాశలో ఉన్న కాంగ్రెస్ భౌతిక దాడులకు దిగుతోందని కేటీఆర్ ఆరోపించారు. తమ పార్టీ నేతలను భౌతికంగా అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని.. ఘటనపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానని తెలిపారు.
మరోవైపు.. శాసనసభ ఎన్నికల వేళ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడికి నిరసనగా బీఆర్‌ఎస్.. దుబ్బాక నియోజకవర్గ బంద్‌కు పిలుపునిచ్చింది. నియోజకవర్గంలోని దుబ్బాక, అక్బర్‌పేట్, భూంపల్లి, మిరుదొడ్డి, తొగుట, రాయపోల్, దౌల్తాబాద్, చేగుంట, నార్సింగ్ మండలాల్లో దుకాణాలు మూసేసి వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ను పాటిస్తున్నారు. ఎన్నికల ప్రచారాల్లో ఇప్పటికే విమర్శలు-ప్రతి విమర్శలతో రాజకీయ వేడి నెలకొన్న తరుణంలో తాజా ఉదంతం అధికార, విపక్షాల మధ్య మాటల మంటలు రేపింది. ప్రజాక్షేత్రంలో దాడులు సరికావంటూ నిన్నటి ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి మండిపడగా.. ప్రతిపక్షాలు సైతం ధీటుగానే స్పందించాయి.
ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు. పార్లమెంటు సభ్యుడికే సరైన భద్రత ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో ఎంపీకే రక్షణ లేకుంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన నిందితుడిని పట్టుకున్న ప్రభుత్వం.. దాడి ఎందుకు చేశాడని విచారణ చేసి నిజానిజాలను వెల్లడించాల్సిన బాధ్యతను విస్మరించి, విపక్షాలపై దుష్ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలు, పోలీసులను దగ్గర పెట్టుకుని దాడికి నిరసనగా బంద్‌కు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. దాడిపై సమగ్ర విచారణ చేసి నిజానిజాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ దాడులను ప్రోత్సహించదని, కాంగ్రెస్ అంటేనే అహింసకు మారు పేరని ఆయన వ్యాఖ్యానించారు.