ETV Bharat / state

KTR Tweet on Mission Bhagiratha Scheme : సీఎం కేసీఆర్ వల్లే ప్రతి ఇంటికి నీళ్ల కనెక్షన్ సాధ్యమైంది.. కేటీఆర్ ట్వీట్ - ప్రతి ఇంటికి నాలా ద్వారా నీరు ఇస్తున్న తెలంగాణ

KTR Tweet on Mission Bhagiratha Scheme : దేశంలో ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇచ్చిన రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాను ఇండియన్ ఇండెక్స్‌ ట్వీట్​ చేసింది. ఈ జాబితాలో తొలి స్థానంలో తెలంగాణ ఉందని పేర్కొంది. ఈ విషయంపై మంత్రి కేటీఆర్​ స్పందించారు. ప్రతి ఇంటికి మిషన్​ భగీరథలో భాగంగానే వాటర్​ కనెక్షన్​ ఇచ్చిందని అన్నారు.

Mission Bhagiratha Scheme
KTR Tweet on Mission Bhagiratha Scheme
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 12, 2023, 10:56 AM IST

KTR Tweet on Mission Bhagiratha Scheme : దేశంలోనే తెలంగాణ మొదటి సారి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ(Mission Bhagiratha Scheme in Telangana)లో భాగంగా వాటర్ కనెక్షన్ ఇచ్చిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎక్స్​(ట్విటర్​)లో ద ఇండియన్ ఇండెక్స్ చేసిన ట్వీట్​పై ఆయన స్పందిచారు. దేశంలో ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇచ్చిన రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల జాబితా ట్వీట్ చేసిన ఇండియన్ ఇండెక్స్‌.. తొలి స్థానంలో తెలంగాణ ఉన్నట్లు పేర్కొంది.

దీనిపై స్పందిచిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. విజన్ ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు. తెలంగాణలో మిషన్ భగీరథ విజయవంతం అవ్వడం చూసి... కేంద్రం హర్ ఘర్ జల్ అనే కార్యక్రమాన్ని తెచ్చిందని తెలిపారు. ఈరోజు తెలంగాణ ఏది చేస్తే.. దేశం అది అనుసరిస్తుందని ట్విటర్​ వేదికగా ట్వీట్​ చేశారు.

  • Telangana is The first state in independent India to have launched a project called “Mission Bhagiratha” to provide a potable water connection to every home

    Thanks to our Hon’ble CM KCR’s visionary leadership 👍

    Inspired by Telangana’s success, Govt of India has launched Har… https://t.co/yeZQonlmA2

    — KTR (@KTRBRS) October 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"దేశంలోనే మొదటిసారి ప్రతి ఇంటికి మిషన్​ భగీరథ పథకంలో భాగంగా తెలంగాణ వాటర్​ కనెక్షన్​ ఇచ్చింది. విజన్​ ఉన్న కేసీఆర్​ ముఖ్యమంత్రి కావడం వల్లే సాధ్యమైంది. తెలంగాణను చూసే కొన్ని ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం హర్​ ఘర్​ జల్​ అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఈరోజు తెలంగాణ ఏది చేస్తే.. దేశం అది అనుసరిస్తోంది." - కేటీఆర్​ ట్వీట్​

The Indian Index Tweet on Mission Bhagiratha : అంతకు ముందు ద ఇండియన్​ ఇండెక్స్​ తన ట్విటర్​లో దేశంలో ప్రతి ఇంటికి వాటర్​ కనెక్షన్​ ఇచ్చిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు జాబితాను అందులో పేర్కొంది. ఆ జాబితాలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉండగా.. గుజరాత్​, గోవా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఇంటికి మంచి నీటి పథకం హర్​ ఘర్​ జల్​లో భాగంగా ఈ లెక్కలను ద ఇండియన్​ ఇండెక్స్​ ప్రవేశపెట్టింది.

  • States/ UTs with 100% households with tap water connection: 🚰🇮🇳

    1. Telangana
    2. Gujarat
    3. Goa
    4. Haryana
    5. Himachal Pradesh
    6. Punjab
    7. A & N Islands
    8. D&NH and D&D
    9. Puducherry

    (Jal Jeevan Mission)
    What is the status of your state? Please name it, and we'll tell you.

    — The Indian Index (@Indian_Index) October 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Mission Bhagiratha : మీ ఇంటికి 'మిషన్ భగీరథ' నీళ్లు రావట్లేదా.. అయితే సర్పంచులకు చెప్పండి.!

అసలేంటి మిషన్​ భగీరథ పథకం : రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నాణ్యమైన తాగు నీటి సౌకర్యాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో తీసుకువచ్చిందే మిషన్​ భగీరథ పథకం. ఈ పథకాన్ని 2016 ఆగస్టు 6వ తేదీన గజ్వేల్​ నియోజకవర్గంలోని కోమటిబండ గ్రామంలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్​ కలిసి ప్రారంభించారు. ఇలా నల్లాల ద్వారా ఇంటింటికీ తాగు నీరు ఇవ్వడం వల్ల ఫ్లోరైడ్​ బాధిత గ్రామాలు అనేవి లేకుండా పోయాయి. ఈ మిషన్​ భగీరథ పథకం ద్వారా అత్యధికంగా లబ్ధి పొందుతున్న జిల్లాల్లో నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్​, ఆదిలాబాద్​ ఉన్నాయని తెలంగాణ స్టేట్​ స్టాటిస్టికల్​ అబ్​స్ట్రాక్ట్​ 2021 ఇండెక్స్​ తెలిపింది. రాష్ట్రంలోని వంద శాతం గ్రామీణ నివాస ప్రాంతాలకు 2021 నాటికి పైపుల ద్వారా నీటి సరఫరాను చేశారు.

KTR Mancherial District Tour : 'ఇంటింటికీ తాగునీరు ఇచ్చేందుకు మిషన్ భగీరథ పనులు చేపట్టాం'

Water Festival in Telangana : రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో 'మంచి నీళ్ల పండుగ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.