KTR Tweet on Congress Bus Yatra : కాంగ్రెస్ బస్సు యాత్ర తుస్సుమనడం ఖాయమని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ రేవంత్ రెడ్డి అన్న ఆయన.. ముక్కు నేలకు రాసినా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మరన్నారు. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ.. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
-
కాంగ్రెస్ బస్సుయాత్ర...
— KTR (@KTRBRS) October 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
తుస్సుమనడం ఖాయం...
సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ.
చీకటి పాలనకు చిరునామా కర్ణాటక.
గత పదేళ్ల కాలంలో..
గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదు.
విభజన హామీలపై ఏనాడూ…
">కాంగ్రెస్ బస్సుయాత్ర...
— KTR (@KTRBRS) October 19, 2023
తుస్సుమనడం ఖాయం...
సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ.
చీకటి పాలనకు చిరునామా కర్ణాటక.
గత పదేళ్ల కాలంలో..
గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదు.
విభజన హామీలపై ఏనాడూ…కాంగ్రెస్ బస్సుయాత్ర...
— KTR (@KTRBRS) October 19, 2023
తుస్సుమనడం ఖాయం...
సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ.
చీకటి పాలనకు చిరునామా కర్ణాటక.
గత పదేళ్ల కాలంలో..
గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదు.
విభజన హామీలపై ఏనాడూ…
Minister KTR Tweet Today : ఈ సందర్భంగా గత పదేళ్ల కాలంలో గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరు మెదపలేదని కేటీఆర్ ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదన్నారు. విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్‌కు.. తెలంగాణలో పర్యటించే అర్హత లేదని పేర్కొన్నారు. కర్ణాటకలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ వంద రోజుల్లోనే బొందపెట్టిన పార్టీ కాంగ్రెస్ అని.. మేనిఫెస్టోలో ఇవ్వని హామీలనూ నెరవేర్చిన ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు. నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి.. తెలంగాణలో నాటకాలకు తెర తీస్తే నమ్మేవారు ఎవరూ లేదని స్పష్టం చేశారు.
KTR Today Tweet : కరప్షన్‌కు కేరాఫ్ కాంగ్రెస్ అని కేటీఆర్ విమర్శించారు. కర్ణాటకలో కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను నిత్యం వేధింపులకు గురి చేసి.. ఇక్కడికొచ్చి నీతి వాక్యాలు చెబుతున్నారా అంటూ నిలదీశారు. పోడు భూముల సమస్యను దశాబ్దాలుగా కోల్డ్ స్టోరేజీలో పెట్టింది మీరైతే.. ఏకంగా 4.50 లక్షల ఎకరాల భూములు పంచి అడవి బిడ్డలకు పట్టాభిషేకం చేసిన ప్రభుత్వం తమదంటూ స్పష్టం చేశారు. శ్రీకాంతా చారిని బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి.. ఆ అమరుడి పేరెత్తే హక్కు లేదన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యమే.. వందల మంది బలిదానాలకు కారణమైందని మంత్రి ఆరోపించారు.
నిన్న అయినా.. నేడు అయినా.. రేపు అయినా తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని కేటీఆర్ ఆక్షేపించారు. గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పగించిన నాడే.. తెలంగాణ కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్ మొదలైందన్నారు. ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ టీపీసీసీ చీఫ్ అని.. టిక్కెట్ల కోసం రూ.కోట్ల సొమ్ముతో పాటు భూములు రాయించుకుంటున్న రాబంధు రేవంత్ అని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే మూడు రోజుల పర్యటన చేసినా.. మూడు వందల రోజులు ముక్కు నేలకు రాసినా.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మరన్నారు. వైఫల్యాల కాంగ్రెస్‌ను ఎప్పటికీ విశ్వసించరని కేటీఆర్ ధ్వజమెత్తారు.
KTR Fires on Modi in Twitter : "బరాబర్ మాది కుటుంబపార్టీయే.. రాష్ట్రమే మా కుటుంబం"
"కాంగ్రెస్ బస్సు యాత్ర తుస్సుమనడం ఖాయం. గిరిజన వర్సిటీపై పదేళ్లుగా రాహుల్ ఎందుకు నోరు మెదపలేదు. విభజన హామీలపై ఏనాడూ రాహుల్ ఎన్డీఏను ప్రశ్నించలేదు. విభజన హామీలపై ప్రశ్నించని రాహుల్‌కు రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను వంద రోజుల్లోనే బొందపెట్టిన పార్టీ కాంగ్రెస్. తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యమే.. వందల మంది బలి దానాలకు కారణమైంది. తెలంగాణకు నంబర్ వన్ విలన్.. కాంగ్రెస్. ముక్కు నేలకు రాసినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మరు." - ట్విటర్లో కేటీఆర్