మిషన్ భగీరథ అమలుతో రాష్ట్రంలో ప్రస్తుతం ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలే లేవని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 967 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు ఉండేవని.. మిషన్ భగీరథను విజయవంతంగా అమలుచేయడం వల్ల ఇప్పుడు ఆ సంఖ్య సున్నాకు చేరుకుందని ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిందంటూ ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాలను ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు లేకుండా కృషి చేసిన మిషన్ భగీరథ బృందానికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండిః కరోనా కారణంగా పరిమితంగానే బస్సు సర్వీసులు